|
|
Articles: TP Features | విశ్వ వేదిక 'మ్యూజిగుల్' - Site Administrator
| |
ఎవరేమనుకున్నా మన సంగీత సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రపంచానికి అందివ్వడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అనివార్యమన్నది కూచిభొట్ల ఆనంద్ నిశ్చితాభిప్రాయం. అందుకే ఆనంద్ వినూత్నమైన వైబ్ సైట్ ను రూపొందించారు. వేలవేల సంవత్సరాలుగా తెలుగునేలపై పరిఢవిల్లిన సాహిత్య, సంగీత సంపదను విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందివ్వడానికి 'మ్యూజిగుల్' పేరుతో ఈ సమగ్రమైన వెబ్ సైట్ రూపుదిద్దుకుంది.
'మ్యూజిగుల్' అంటే యావత్ తెలుగు సంగీత, సాహిత్య ప్రక్రియలను ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చే ఒక వేదిక అని ఆనంద్ వివరిస్తున్నారు. ప్రపంచంలోని ఏ విషయాన్నైనా తెలుసుకోడానికి నెటిజెన్స్ గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ఎలా వినియోగిస్తున్నారో ఇకపై తెలుగు సంగీతానికి, సాహిత్యానికి సంబంధించిన అంశాలను తెలుసుకోడానికి 'మ్యూజిగుల్' అలానే ఉపయోగపడుతుందని ఆనంద్ తెలిపారు.
ఆంధ్రదేశంలో ప్రతిభకు కొరత లేదు. ఆ ప్రతిభ ద్వారా జీవనోపాధి కలిగితీరాలి. మ్యూజిగుల్ ఆ బాధ్యతను స్వీకరిస్తోందని ఆనంద్ వివరించారు. కవులు, రచయితలు, గాయనీ గాయకులు, ఇతర కళాకారులు తమ ప్రతిభను విశ్వవేదికపై ప్రదర్శించడానికి ఇప్పుడు మ్యూజిగుల్ చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మ్యూజిగుల్ లో సంగీత, సాహిత్యాలకు సంబంధించి లభించనిదంటూ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. దాదాపు 40 దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులకు ఇక్కడి తెలుగునేలపై ఉన్న ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. వారంతా మ్యూజిగుల్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారని ఆనంద్ చెప్పారు. దేశంలో దాదాపు రెండు వందల రికార్డింగ్ కంపెనీలు ఉన్నాయని, వాటిలో దాదాపు 150 కంపెనీలతో మ్యూజిగుల్ అవగాహన కుదుర్చుకుందని ఆయన తెలిపారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|