|
|
Articles: My Thoughts | 'పింగళి'కి ప్రాణం పోద్దాం!! - Site Administrator
| |
ఆ మర్నాడు బయల్దేరి గుంటూరు వెళ్ళిపోయాను. నటరాజశేఖర్ గారు నా ప్రయత్నం గురించి విని కొంచెం ఆశ్చర్యపోయారు. అయితే నేను అచ్చేయగలనా... లేదా అని ఆలోచించకుండా... తన దగ్గర ఉన్న వింధ్యరాణి నాటకం ఇచ్చారు. అది అముద్రితం. డి.వి. సుబ్బారావుగారు ఆ నాటకంలో వింధ్యరాజుగా నటించి ప్రఖ్యాతుడయ్యాడు. ఆ నాటకం ఆ తర్వాత సిన్మాగా కూడా రూపుదిద్దుకుంది. అందులోనూ... సుబ్బారావుగారు నటించారు. ఈ విషయాలన్నీ పింగళి గురించి నేను చదివిన పుస్తకాల ద్వారా తెల్సుకున్నాను. ఇంతకీ విషయం ఏమంటే... ఆ నాటకం స్ర్కిప్ట్ నటరాజశేఖర్ గారు తానే స్వయంగా ఓ నోట్ బుక్ లో రాసుకున్నారు. దాన్ని నా మీద నమ్మకంతో ఇచ్చారు.
మళ్ళీ వేట మొదలు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం, ఠాగూరు గ్రంథాలయాలతో పాటు ప్రకాశం జిల్లా వేటపాలెం లైబ్రరీలో వెతగ్గా పింగళి రాసిన జేబున్నీసా, క్షాత్రహిందు, గమ్మత్తు చావు, ఒకే కుటుంబం, మేవాడ్ రాజ్యపతనం నాటకాలు లభ్యం అయ్యాయి.
మొత్తానికి పింగళి నాగేంద్రరావుగారు రచించిన ఏడు నాటకాలు దొరికాయి. వీటిని ముందు కంపోజ్ చేయించేసి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకున్నాను. కంపోజింగ్ కు ఇచ్చేశాను. నాటకాలు చదవడం మొదలెట్టిన తర్వాత పింగళి సామాన్యుడు కాదనే విషయం అర్ధం అయింది. ఆ నాటకాల వెనుక మహాత్మాగాంధీ ప్రభావం కనిపించింది. బందరు జాతీయ కళాశాలకు గాంధీ రెండుసార్లు జరిపిన పర్యటన, చేసిన ఉపన్యాసాలు ఆ తరానికి ఇచ్చిన స్ఫూర్తి కనిపించింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|