|
|
Articles: TP Features | అపురూప కవి అన్నమయ్య - Site Administrator
| |
ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అన్నమయ్యలో ఉన్న మట్టివాసన. జనపదుల జీవితంలోంచి, రాగాల్లోంచి, లయల్లోంచి, భావజాలం నుంచి, లాలిజోలల నుంచి దేశి సంపదను గ్రహించి సంగీత సాహిత్యాలుగా మలచిన మహనీయుడు అన్నమయ్య. ఆయన అభివ్యక్తి ఆయనది. ఎవ్వరి ఊహకూ అందని భావాలు ఆ కవి ఊహల్లోకి వచ్చాయి. ఒక జాతి ఉన్నతోన్నత శిఖరాలు అందుకోవాలంటే మొత్తం జాతి జాగృతం కావలసి ఉంటుంది. జనసముదాయాలు కలలు కంటాయి. అలా కనే కలలే పురాణాలు. ఆశలు, ఆకాంక్షలు, ఆదర్శాలు అన్నీ ఈ పురాణాలలో ప్రతిఫలిస్తాయి. వేంకటేశ్వరునికి సంబంధించిన పురాణం అనే నమ్మకానికి అన్నమయ్యే తనదైన రీతిలో కానుకలర్పించాడు.
అన్నమయ్యలో భక్తి, సంగీతం, కవిత్వం అపూర్వమైన రీతిలో సమ్మేళనం చెందాయి. జన సముదాయం పరమార్థ చింతనకు, పారలౌకికమైన నమ్మకాలకు భక్తి ఒక ప్రతీక.
జనసముదాయం జనతను జాగృతం చేసినట్లే యుగపురుషులు అవతరించి కూడా జాగృతం చేస్తారు. వారివల్ల సాహిత్యం, సంస్కృతి, సంగీతం, తాత్విక చింతన వికాసం చెందుతాయి. అలాంటి వికాసాన్ని కలిగించిన కవి అన్నమయ్య. చెప్పేది భక్తితత్వమైనా కొత్తగా చెప్పాలన్న తపన అన్నమయ్యలో కనిపిస్తుంది. అతని అలంకార శాస్త్రమే వేరు. అందరు కవులు వాడే పదాలు వాడడు. పదాలు వాడడంలో కాని వర్ణనల్లో కాని మన ఊహకందని ఎత్తులకు వెళ్తాడు. అన్నమయ్యను ఉదాహరించటమంటే తెలుగువారి శక్తిని ఉదాహరించటమే.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|