|
|
Articles: TP Features | సుప్రీంకోర్టు గొప్ప తీర్పు - Site Administrator
| |
ఆంగ్లేయులు తమ స్వార్థ ప్రయోజనాలకి బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును ప్రవేశపెట్టినా, 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు కొన్ని విశేషాధికారాలను కట్టబెట్టి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల స్థాయిల వరకూ మాతృభాష ద్వారా విద్యాబోధన జరిగే ఏర్పాట్లు చేశారు. ఇంగ్లీషును ఒక భాషగా మాత్రమే బోధించారు. ఇవి నలభయ్యవ దశకంలోనే అమలులోకి వచ్చాయి. ఆ విధంగా వారు తమ తప్పును దిద్దుకున్నారు. ఈ విధానంలో నష్టం ఏమి? దళితులతో సహా అనేకులు కళాశాలలోనే ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యను అభ్యసించి జీవితంలోని అన్నిరంగాలలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. శాస్త్రవేత్తలుగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా పి.వి. కళాశాల స్థాయిలోనూ, పట్టభద్రస్థాయి వరకూ మాతృభాషలోనే విద్యను అందించడానికి పూనుకున్నారు. మనం ఆనందించవలసిన ఈ పరిణామం ఎందుకు ఆగిపోయింది? ఎందుకు తిరోగమన మార్గం పట్టింది? మనందరం తలలు పట్టుకొని ఆలోచించవలసిన ప్రశ్నలివి.
సుప్రీంకోర్టు వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేధావులు అంగీకరించినా అంగీకరించకపోయినా భాషకి సంస్కృతికి సంబంధం లేదన్నది పసలేదని వాదన. భాషకి తిలోదకాలిచ్చినప్పుడు సంస్కృతి విడిగా మనలేదు. సుప్రసిద్ధ ఆంగ్ల కవి పి.బి.షెల్లీ మాటలను పేరడీ చేస్తూ మనం ఇలా అనుకోవచ్చు. 'If language perishes, can culture survive?'
ఇకపోతే ఐలయ్య ఇతర వ్యాఖ్యానాలూ, ప్రతిపాదనలూ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు, ఐలయ్య అన్నట్లు 'రాజ్యం తన మాతృభాషను పిల్లలపై రుద్దటానికి వీలులేద'ని నిజంగా తేల్చి చెప్పితే, ఈ విషయాన్ని మనం మరింత లోతుగా పరిశీలించాలి.
మాతృభాషను రుద్దటం ఎవరిపైన?
కన్నడం మాతృభాషగా కలిగిన వారిపైనా? ఇతరులపైనా? కన్నడం మాతృభాషగా కలవారిపైన అయితే అది రుద్దటం ఎలా అవుతుంది? అది వారి తల్లిభాష. వారు తమ తల్లిపాలతో రంగరించి అలవోకగా అప్రయత్నంగా ఒంటపట్టించుకున్న భాష. తల్లిభాషను ఎవరూ ఎవరిపైనా రుద్దలేరు. అందులో విద్యను అభ్యసించటం ఆ పిల్లల జన్మహక్కు. అది ఒకరు ఇచ్చిన హక్కు కాదు. రాజ్యాంగమైనా ఇచ్చే హక్కు కాదు. అది రాజ్యాంగ గ్యారంటీ చేసే హక్కు మాత్రమే.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|