|
|
Articles: TP Features | ఆది కవికి వెయ్యేళ్ళు - Site Administrator
| |
ఇలా మతాభిమాన విధ్వంసానికి గురికాకపోయినా ఆ రచయితలు గాని, వారి రచనలు గాని ఆ తరువాత కాలంలో వచ్చిన మతాభిరుచి ప్రాధాన్యం వల్ల రాజాదరణ, నిరాదరణల వల్ల సహజంగానే తమ ఉనికి కోల్పోయి ఉండవచ్చు. ఖిలమైపోయిన ఉండవచ్చు. ఇంతగా ముద్రణ, పుస్తక ప్రచురణ, వ్యాప్తి నిత్యజీవితంతో అల్లుకుపోయిన ఈ కాలంలోనే యాభై అరవై ఏళ్ళ కిందటి రచయితలే కనుమరుగైపోతున్నారు. కాలంలో కలిసిపోతున్నారు. అప్పటి పత్రికలు అసలు కనబడవు. ఇరవై ముప్పై ఏళ్ళు పాఠకుల కళ్ళ ముందు కనపడకపోతే వాళ్ళ రచనలు ప్రచురణలో లేకపోతే ఆ రచయితలు విస్మృతులైపోతున్నారు కదా!
నూరేళ్ళ నాటి విజ్ఞాన చంద్రికా మండలి రచనలు ఇప్పుడు ఏదో పరిరక్షిత గ్రంథాలయాలలతో తప్ప పురా విజ్ఞాన పరిశోధన సంస్థలలతో తప్పు అది కూడా ప్రభుత్వ సంరక్షణకు, శ్రద్ధాసక్తులకు నోచుకున్న అధికారుల పర్యవేక్షణలో ఉండి ఉండవచ్చు. కనపడవచ్చు. పూర్వకాలంలో వ్యక్తుల ఆలనా పాలనలో తప్ప సంస్థాగతంగా గ్రంథ పరిరక్షణ జరిగి ఉండే అవకాశం లేదు.
రాజరాజ నరేంద్రుడు వేమ మతాభిమాని అని నన్నయ్య భారత అవతారికలో చెప్పకనే చెప్పాడు. అందువల్ల అంతకు పూర్వపు గ్రంథాలను ఎవరూ పట్టించుకొని ఉండరు. 'గాసట బీసట చదువు తెలుంగు జాతికిన్ వ్యాసముని ప్రణీత పరమార్థము' తెలిపిన మాన్యుడు నన్నపార్యుడని ఎర్రప్రగడ స్తుతించాడు కదా ఆయనను. ప్రజల వాడుకలో లేని ఏ గ్రంథమూ కాలాంతరాన మనజాలదు. రాజరాజ నరేంద్రుడి పరిపాలన కాలం 1019(20?) - 1061గా చరిత్రకారులు నిర్ణయిస్తున్నారు. నన్నయ్య ఎక్కడ పుట్టాడో, కచ్చితంగా ఏ సంవత్సరంలో జన్మించాడో చెప్పటానికి ఆధారాలేవీ లేవు. ఆయన తమిళ ప్రాంతం నుంచి ఆంధ్ర దేశానికి తరలివచ్చినట్లు రాజవంశం వారు తమ వెంట తీసుకొని వచ్చినట్లు చరిత్ర పండితులు భావిస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ పరమపదించాడో తెలియదు.
వేంగీ దేశపు రాజకీయాలు అల్లకల్లోలంగా ఉండేవి. అన్నదమ్ముల మధ్య యుద్ధాలు ఎడతెగకుండా జరుగుతుండేవి. అందుకే రాజరాజ నరేంద్రుడు తమ కుల గురువైన నన్నయ్యను మహా భారతం రచించమని కోరాడేమో - యుద్ధాల వల్ల మహా విపత్తు ఏమి సంభవిస్తుందో నిరూపించటానికి.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|