|
|
Articles: TP Features | కార్పొరేట్ యోధులు - Site Administrator
| |
పుష్కలంగా అవకాశాలు
మరి ఇటువంటి మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ను పూర్తి చేసిన తరువాత మాజీ సైనికాధికారులకు కెరీర్ అవకాశాలు ఏవిధంగా ఉంటాయి? ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత సైనికాధికారులు క్యాంపస్ లో ప్లేస్ మెంట్ ఇంటర్వ్యూలకు హాజరవుతారని అగర్వాల్ తెలిపారు. 'ఈ ఆఫీసర్లను కార్పొరేట్ సంస్థలలో సాంకేతిక విభాగాలలోను, ఇతర ఫంక్షనల్ విభాగాలలోను చేర్చుకుంటారు. గతంలో ఇలా వీరిని చేర్చుకున్న పారిశ్రామిక రంగాలలో ఐటి, రీటైల్, ఉత్పత్తి, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సంస్థలు, ఎస్ఎంఇలు వంటి సర్వీసెస్ పరిశ్రమలు ఉన్నాయి' అని ఆయన తెలియజేశారు.
'అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల అభివృద్ధి, మార్కెటింగ్, ఐటి, కార్పొరేట్ కమ్యూనికేషన్లు, వ్యూహాత్మక ప్లానింగ్, బోధన వంటి కీలక విభాగాలలో పని చేయడం ద్వారా కార్పొరేట్ ప్రపంచంలో విజయానికై మాజీ సైనికులు తమ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు' అని షెర్రీ చెప్పారు.
సైన్యంలో 15 సంవత్సరాల పాటు పని చేసిన భవానీ శంకర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో ప్రస్తుత 2010 క్లాస్ లో ఉన్న విద్యార్థులలో ఒకరు. 'సొంతంగా ఒక సంస్థను నిర్వహించదగిన స్థాయికి వృద్ధి చెందాలని నా ఆకాంక్ష. సైన్యంలో నేను నేర్చుకున్నది కార్పొరేట్ ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది. అక్కడ విజయమే లక్ష్యం. ఇక్కడ గరిష్ఠ స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం' అని భవానీ శంకర్ చెప్పారు.
ఈ రక్షణ సిబ్బందిని తమ సంస్థలలో ఉద్యోగులుగా తీసుకోవడం కార్పొరేట్ భారతానికి నిజంగా గర్వకారణమే. తమ సాటిలేని అంకితభావంతోను, క్రమశిక్షణతోను వీరు కచ్చితంగా ఏ సంస్థకైనా గొప్ప 'అస్సెట్' అని చెప్పవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|