TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
స్వర్గం-నరకం...ఎక్కడ?
- Site Administrator
< < Previous   Page: 3 of 3    
ధనవంతులు చాలా సంతోషంగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు.. కాదా.. అందంగా ఉండేవాళ్లూ, ఠీవిగా బతికే వాళ్ళూ, పాపులర్ అయిన వాళ్ళూ ఆనందమయమైన జీవితం సాగించేస్తున్నారనుకుంటాం పోనీ. విలాసవంతమైన జీవితం గడిపే గ్లామర్ ప్రపంచపు ప్రముఖులు సుఖ సంతోషాలతో బతుకుతారని నమ్ముతూ ఉంటాం. అలాగైతే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మహానటి సావిత్రి... దివ్యభారతి... మైఖేల్ జాక్సన్... ఇంకా ఎందరో ఈ ప్రపంచం కావాలని కోరుకునే వాళ్లు సంతోషంగానే బతికుండాలిగా. కాని లేదే? మనలో చాలా మంది ఏదైతే సంతోషం అనుకుంటామో అది కానే కాదని మనకు అర్ధం అవుతూ ఉంది. తడిగుడ్డతో గొంతులు కోసే ఈ పోటీ ప్రపంచంలో ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ దునియాను అందిపుచ్చుకోడానికి దుర్మార్గం సాగిపోతోంది. తెల్లారి లేస్తే టెలివిజన్లు, వార్తా పత్రికలు మనుషులపై దాడి చేస్తున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారి కథలను మనపై గుమ్మరించి ముంచుతున్నాయి. వారిలో నువ్వూ అయిపోడానికి ఏం చేయాలో చెవిలో ఇల్లు కట్టుకుని నూరి పోస్తున్నాయి. ఎవరో సినిమా హీరోయిను జీరో సైజు అంది కదా అని ఆకలితో మలమల మాడిపోయి, నోరు కట్టేసుకుని నాజూగ్గా, రివటలా తయారయ్యి ఆహా! ఏమి నా సొగసు అని అనందిస్తావు. ఇదే సంతోషం అనుకుంటావు. కానీ నీకు సహజసిద్ధంగా అలవాటైన తిండి యావ మళ్ళీ నీకు తెలియకుండానే నిన్ను లొంగదీసుకుంటుంది. అంతే నాజూకు అమ్మడి కాస్తా కడవంత గుమ్మడిలా తయారై మళ్ళీ పాత నరకంలో పడిపోతావు. అప్పుడు అర్ధం అవుద్ది నీకు తెచ్చి పెట్టుకున్న సంతోషానికి నిజమైన సంతోషానికీ ఉన్న తేడా. వాస్తవానికి నీవు నిన్ను ఎంత ఉన్నతంగా ఊహించుకుంటావో, నీ గురించి నీవు ఎమనుకుంటున్నావో, నీ జ్ఞానేంద్రియాలను ఏ విధంగా వినియోగించుకుంటున్నావో... దానిపైనే సంతోషం, ఆనందం అనేవి ఆధారపడి ఉంటాయి. నువ్వు పరిస్థితులను అదుపు చేయలేకపోవచ్చు. అయినా నిన్ను నువ్వు నియంత్రించుకోగలవు. మనస్సును అదుపు చేసుకుని సానుకూల దృక్పథంతో నిలుచుంటే చాలు. మనం ఉన్నతమైన భావనతో ఉండగలిగితే సంతోషాన్ని పొందవచ్చు. ఎవరైతే దేనికీ భయపడరో, ఒటమిని అంగీకరించడానికి అంగీకరించరో వారిలో తేజస్సు ఉంటుంది. ఎవరైతే మానవ సంబంధాలను అంటిపెట్టుకుని ఉంటారో వారిని ఆనందం వెన్నంటి ఉంటుంది. నువ్వు ఎక్కడికి ప్రయాణించానుకుంటున్నావో దానికి చోదకుడివి, మార్గదర్శవి నీవే... ఇప్పుడు చెప్పండి మీ పయనం స్వర్గానికా? నరకానికా?

Be first to comment on this Article!

< < Previous   Page: 3 of 3    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.