TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
సంకల్ప విజయం
- Site Administrator
< < Previous   Page: 3 of 3    
డిగ్రీ వరకు చదివినా ఉద్యోగం ఏమీ చేయలేకపోతున్నామని ఎందరో అమ్మాయిలు నిరాశగా మాట్లాడుతారు. అవసరమైతే తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి.... తప్పదు. కాని అంత కంటే గొప్పపని ఇంట్లో ఉంది. పిల్లల సంరక్షణ, అభివృద్ధి విషయంలో చదుదవుకొన్న స్త్రీ అయితే మరింత శ్రద్ధ వహించవచ్చు. తనకు తానుగా ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకోవచ్చు. చదువుకోటమన్నది ఎవరికి వారు విజ్ఞులుగా ఎదగటం కోసం కాని ఉద్యోగార్థం కాదు కదా! మాకేమి పనిలేదు చేయడానికి అనుకొనేవారు కొందరయితే మాకు తోచిన పని ఇంటిపట్టునే ఉండి చేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించగలుగుతున్నాం అంటూ ఆత్మ విశ్వాసం ఉట్టిపడేలాంటి అమ్మాయిల్ని చూస్తున్నాం. నాకు తెలిసిన అమ్మాయి తన ఆర్నెల్ల బిడ్డతో పాటు ఉద్యోగినులయిన మరో ముగ్గురు స్త్రీల పిల్లల బాధ్యత తను తీసుకొంది. చైల్డ్ కేర్ అని బోర్డు ఏమీ పెట్టకుండానే మరో పనిమనిషిని పెట్టుకొని ఆ పిల్లల బాధ్యతనంత ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఆరుగంటలదాకా చూస్తుంది. మంచి ఆదాయంతో పాటు నెమ్మదిగా ఈ పనినే విస్తృతస్థాయిలో పెంచుకొంటూ పోయే ఆత్మవిశ్వాసం కూడా గడించింది.! మరొకమ్మాయి భారీ ఎత్తున కాకుండా ముందుగా గోంగూర, నిమ్మకాయ వంటి రెండు రకాల పచ్చళ్ళు పెట్టడం ప్రారంభించి ఇరుగు పొరుగుకు అమ్మటం మొదలెట్టి ఈ రోజుకి కూడా పచ్చళ్ళ కంపెనీ నడుపుతోంది. చిన్నమొత్తాల్లో అప్పులు ఇవ్వటానికి బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపనీలు చాలా వచ్చేయి. మనసుంటే మార్గముంటుంది. చేయాలనే సంకల్పముంటే దీక్ష, పట్టుదల, శ్రమ తోడయితే విజయాలు మన వెంటనే అంటిపెట్టుకుని ఉంటాయి. తరచుగా మనం ఎవరిని కదిపినా ఒక మాట వినబడుతుంటుంది. 'చేయాలనే ఉంది. టైమ్ లేదండి, తీరక అస్సలుండడం లేదండి' అని టైము లేకపోవడం అనేది మనకు మనం అనుకోవడమే! ఉన్న ఇరవైనాలుగు గంటల్ని ఎలా సద్వినియోగం చేసుకొంటామన్నది వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్న విషయమే. సమయం చాలటం లేదు. ఏమీ చేయలేకపోతున్నామని విచారించటానికే సమయమంతా సరిపోతుంటుంది. పనిని ప్రారంభించకుండానే అది మొదలెడితే చేయగలమా అనే నిత్యశంకితులు ఏ పని చేయలేరు. అట్లాగే తమ పనులన్నీ ఎవరో ఒకరి మూలంగ చెయిపోయాయని ఇతరులను నిందించే వాళ్ళు ఏమీ చేయలేరు. మన స్థాయికి తగ్గ ఏదో పనినో, వ్యాపకాన్నో కల్పించుకోవటమన్నది మన చేతిలోపనే. మంచి మంచి పనులు చేయలేకపోయినా మంచివారిని, మంచి నేతలను గుర్తించటమయినా మంచిపనే! అందువల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Read 4 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 3 of 3    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.