|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
సుం:- హలో లేడీస్ హాస్టలేనాండీ!నేను సుదర్శనాన్నండీ! కొంచెం ఫోను దగరకు తాయారును పిలుస్తారా? ఏవిటీ? మాటాడేది తాయారుగారేనా?! థాంక్యూ!థాంక్యూ!! నమస్కారమండీ! నేనెప్పుడూ మిమ్మల్ని చూడ లేదండీ! అఫ్కోర్స్! మీరు కూడా అంతేననుకోండి. ఇప్పుడు మీమాటలు వింటుంటే, ఆకాశవాణిలో ప్రసారాలు చెప్పే . . ఆ పైన ఫోను లో 'నంబర్ ' ప్లీజ్ అనే, ఇంకా చెప్పాలంటే లతా మంగేష్కర్, ఉషా ఊతప్ప, పి.సుశీల గొంతుల్ల ఎంతోశ్రావ్యంగ వుండి,ఇంకా..ఇంకా . . విన బుద్ధేస్తోదండీ! అలా నవ్వకండి!. . మీ నవ్వు తో నా ఒళ్లు పులకిస్తోంది. నేనసలు ఎందుకు ఫోను చేశానో తెలుసాండీ? మీ హాస్టల్ చూశాక నేనో చక్కని గేయం రాశానండి! అది మీకు వినిపించాలని! చదవమంటారా? అయితే వినండి-
లేడి హాస్టలు లోన-లేడి లాగున్నరు మీరు!
వేడి చూపులు మీవి - మాడి పోతున్నాను నేను!!- ఎలాగుందండీ గేయం? ఏవండీ! మీరో చక్కని పాట పాడండీ! వినాలనుంది. ప్లీజ్! . .
థాంక్యూ!
(ఏడు కొండలు ప్రకాశం మంచాన్ని ఫోను దగ్గరకి జరుపుతాడు. సుందరం మంచం మీద వాలి తన్మయత్వంతో ఫోనులో వింటున్నాడు. ఏడుకొండలు ఫోను లాక్కుని వింటాడు. మళ్లీ సుందరం ఫోను లాక్కుంటాడు. ఇంతలో శేషావతారం ప్రవేశిస్తాడు)
శేషావతారం:- ఆహాఁ!ఆహాఁ!! రూము రాజమన నిట్లుండవలె! సుందరా! త్వదీయ నిలయమ్మునిలయమ్ము స్వర్గ ధామమ్మువలె నను మైమరపించు చుండె! ఇంద్ర భవనమ్ము వలె ఇంపు గొలుపుచుండె! ఆహాఁ! ఎందరో సుందరాంగులు నగ్న నృత్యములు చేయుచూనా కన్నులకు పండువ చేయుచూ,తమ సౌందర్యాన్ని అందుకోమన్నట్లు చూచుచూ నవ్వు చుండె. ఇంకనూ .. ఇంకనూ . . .ఇంకనూ....
ఏ:- ఒరే! ఆ ఎదవ తెగులు మానేసి మామూలుగా ఏడు.
శే:- నీ అప భ్రంశపు తెలుగు కన్నా నా తెలుగు మంచిదే కదా?
సుం:- (ఫోనులో) అబ్బే! అదేం లేదండీ! అదో గార్ధభ ఘోష! నా రూంకో గాడిదొచ్చాడు. వాడ్ని పంపించెయ్యాలి. సాయంత్రం సరిగ్గా ఆరింటికి ఫోను చేస్తాను. అప్పుడు ఇంచక్కా డ్యూయెట్టు పాడుకుందాం.ఈ లోపున 'అమ్మ నీ కమ్మనీ దెబ్బ!' పాట ప్రాక్టీసు చెయ్యండి, వుంటాను.గుడ్!ఒఏ.కేఆ!
(సుందరం ఫొను క్రెడిల్ చేసి పక్కనే వున్న ఏడుకొండల్ని కౌగిలించుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు.)
ఏ: గురూ! నేను గురూ! నీ తాయారుని కాదు. అబ్బ నా బుగ్గ కందిపోతోంది గురూ! (బుగ్గ తడుముకుంటాడు)
శే:సుందరం ఎవ్వనించొచ్చె నీకా పులుకరింత? ఏమా పులకింత? చెపుమా నా కొకింత!
సుం: ఏడు కొండలు వీపుపై గట్టిగా చరిచి) అవతారం! యూ!డామిట్! రసవత్తరమైన సన్నివేశాన్ని రసాభాస చేసి పారేశవురా! నే పిలవకుండానే, చెప్పా పట్టకుండా ఊడి పడ్డావురా!
శే:- ఏమిదీ? మనో చాంచల్యమై ఉండనోపు. కాదమువా ఏడూ?!
సుం:-నీశ్రాద్ధం ముందు నోర్ముయ్యి!
శే:- ఎందుకట్లందువు సుందరా? నీ నించి సుందర సూచి కావలసి వచ్చినాడ.
సుం:- ఒరే! అవతారం! నీ తెలుగు భాషతో నన్ను హత్య చెయ్యకురా! నీకేంకావాలో మామూలుగా చెప్పేడు.లేకపోతే బైటికి పో!
శే:- నీదగ్గరున్న రెడీరెకనర్ నాకో సారి కావాలి.
సుం: ఎందుకూ?!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|