|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
బాబాజీ పీలజా గురువు : ఈయన ఇల్లు గురుస్థానం నుండి సేవా సదనానికి పోయేందుకు ముందు ఎడమ వైపున ఉన్నది. బాబా ఇతని ఇంటి ముందున్న తులసి చెట్ల వద్ద రోజూ లెండి బాగ్ కి వెళ్తూ నిలబడేవారు. బాబా నిలిచిన స్థలంలో వెండి పాదుకలు ఉంచారు. ప్రతి దినం బాబా హారతికి క్లేరియన్ వాయించేవాడు. బాబా కోరిక మీద ఆయన ముందు కూడా వాయించేవాడు.
మహాళ్సాపతికి కళ్ళు కనిపించక ఉన్న సమయంలో ఈయన బాబా సన్నిధికి భుజాన కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు. బాబా సమాధి పొందిన పిదప అతనికి స్నానం చేయించేటప్పుడు విప్పి తీసిన లంగోటి ఇప్పటికీ ఉన్నది. ఈ లంగోటిని క్రమం తప్పక వారిల్ వంశీకులు పూజిస్తున్నారు.
బాగోజీ షిండే : షిండేవాడలో ఈయన ఇల్లు ఉన్నది. ఇతను కుష్టువ్యాధి పీడితుడు. అయినా కూడా బాబా వెనుక నిత్యం అంగరక్షకుడుగా నిలిచి గొడుగు పట్టేవాడు. బాబా చేయి ధునిలో కాలినపుడు ఇతడు మలాము రాసి నయం చేశాడు. బాబాకు ఇతడన్న మహా ప్రేమ.
శ్యామ ఇల్లు (మాధవరావు దేశ్‌పాండే) ద్వారకామయి ఎదురు సందులో కొంచెం ముందుకు పోతే బజారు వస్తుంది. ఆ బజారుకు కుడి పక్క సందులో ఈయన ఇల్లు ఉంది. బాబా ఈశ్వరుడు. శ్యామ అతనికి నంది లాంటివాడు. బాబాతో సహవాసము చేసి ధన్యుడయ్యాడు. బాబా ఇతనికి ఎన్నో మత గ్రంథాలు చదివేందుకు ఇచ్చేవారు. ఆ గ్రంథాలన్నీ ఇంకా వీరి ఇంటిలోనే ఉన్నాయి. ఇతను ఎంతో ధన్యుడు కదా.
మహాల్సాపతి : ఇతని ఇల్లు చావడి నుంచి తాజీంఖానా దర్గాకి పోయే దారిలో ఉంది. బాబాకు సాయి అని నామకరణం చేసిన ధన్యుడు. ఇతని సమాధి ఈ ఇంటిలోనే ఉన్నది. 6.9.1922 లో సమాధి పొందాడు. బాబా ఇతనికి ఎన్నో వస్తువులు తనకు గుర్తుగా ఇచ్చాడు. అందులో ముఖ్యమైనవి (1) బాబా కఫని (2) సటకా (3) ఊది (4) మూడు వెండి నాణాలు (5) పాదుకలు. ఈతని ఇల్లు కూడా ఒక పుణ్యక్షేత్రమే.
బాబా అబ్దుల్లా : చావడికి ముందుగా ఉన్నది. వెళ్ళి చూస్తే ఇతని వైభవం బాబా సహచరుడుగా ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. బాబాకి సంబంధించిన వస్తువులు ఈయన ఇంటిలో ఎన్నో ఉన్నాయి. బాబా భిక్షమెత్తిన ఐదు ఇళ్ళు: (1) సాకారం పాటిల్ షేల్‌కే : ఇది చావడి పక్కనే ఉన్నది. బాబా రోజూ భిక్షకి వెళ్ళి సాకారం రోటి దే అనేవాడు.
(2) వామనరావు గోండికార్ : సాకారం ఇంటికి నేరుగా ఉన్నది. ఇతడు చాలా ధనవంతుడు. బాబా పెంచి పోషించిన లెండిబాగ్ భూమి ఇతనిదే. ఇతని నుంచి ప్రధను కొని బాబాకు ఇచ్చినది. ఇతని ఇంటికే బాబా నిచ్చెన వేసి రాధాకృష్ణ మాయి ఇంటి పైకప్పు నెక్కినది. ఇతడు 15.3.1964 లో సమాధి అయ్యాడు. ఇక్కడకు వచ్చి బాబా ఓ లస్సి కొంచెం రొట్టె ముక్క నాకు పెట్టు అని అరిచాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|