|
|
Articles: TP Features | నాయకులను నిలదీయాలి - Dr. Ramesh Babu Samala
| |
అందుకనే రాజకీయ పార్టీలన్నీ ఆ నాయకుల్ని నిలదీసి ఒక మాట అడగాలి. మీరు తెలుగులో మమ్మల్ని వోట్లు అడుగుతున్నారు కదా! మరి తెలుగు గురించి మీ పార్టీ పాలనా విధానం ఏమిటీ అని అడగాలి. ఇరుగునా, పొరుగునా ఉన్న రాష్ట్రాల్లో వారి భాషలు అన్నివిధాలా క్షేమంగా ఉన్నాయి కదా, వారి పార్టీలకు, నేతలకూ ఆ భాషలంటే ప్రాణం కదా, మరి మీ సంగతేమిటి? అని అడగాలి. కన్నతల్లి మీద ఒట్టువేసి అబద్ధం చెప్పలేవు కదా, తల్లి భాషకేం ఒరగబెట్టదలచుకొన్నావో ఒట్టు వేసి మరీ చెప్పమని నిలదియ్యాలి. తెలుగు భాషోద్యమ సమాఖ్య, ఇతర సంఘాలు, వ్యక్తులూ అంతా ఇప్పుడు ఈ దిశగా ఆలోచించాలి. ఈ విధంగా కదలాలి. వట్టి భాషోద్యమం అంటే కాదు, స్వాభిమానోద్యమంగా భాషోద్యమాన్ని తీర్చిదిద్దుకోవాలి మనం.
యువతీ యువకులు ముందుండి ఈ స్వాభిమానోద్యమాన్ని నడిపించాలి. మేడా మంజూష ఇందుకు నాంది పలికింది. ఆమె కన్నీరు వృధా పోదు. అది దావానలమై మన నాయకుల మెదళ్లను తాకాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|