|
|
Articles: Drama | సంక్రాంతి 'చుట్టరికాలు' - Editor
| |
పిల్ల : బాధపడకు పిలడ
బతుకు అనుబంధంలోన - బువ్వవండి పెడతాను
కష్టపడకు పిల్లడ
క్రీగంటి చూపు అగ్గిలోన - కుడుములొండి పెడతాను
బెంగపడకు పిలడ
నా బుగ్గలెరుపు మంటల్లో - బూరెలొండి పెడతాను
కుంగిపోకు పిలడ
సిగ్గులన్ని రుబ్బి రుబ్బి
నా గుండె మూకుడిలో వేపి వేపి
గారెలొండి పెడతాను
నా ముదురు కొబ్బరి పెదవులేసి
నీ గుండె జిగట బెల్లంతో
మనముదర పాయసం వండుతాను
బుగిలిపోకు పిలడ
భ్రమలు సచ్చిపోవు పిలడ
పిల్లడు : నిను జూసిన ఆ సిటాన - చిటచిట చినుకై పోయాను
నినుజేరిన ఆ దూరాన - చిటికిడంత చినబోయినాను
చిన్నప్పటి ఆ గేపకాలు - చచ్చీ సరిదిద్దుకుంటా
మరో జన్మవుంటే - నా తప్పిదాలు సవరించుకుంటా
(వెక్కి వెక్కి ఏడుస్తాడు పిల్లడు. కళ్లు తుడుచుకోమని తన పయ్యాడ చెంగునందిస్తుంది పిల్ల.)
పిల్ల : (నవ్వుతూ పిల్లడు పక్కనే కూర్చొని)
చెవుల పిల్లివైతే - చెవులు నులిమి తిప్పుదును
బాతుపిల్లవైతే - నీ మెడలు పట్టి వంచుదును
కోడిపుంజువైతే - నీ కాళ్లొట్టుకు నిలబెడుదును
గువ్వ పిల్లవైనావు - గుట్టు తెలవనివ్వలేదు
పావురాయివైనావు - పారిపోయినావు నువ్వు
పిల్లడు : (బాగా తేరుకొని)
ముద్దు మాటలతో - నా పైన యుద్ధం చేసీకు పిల్ల
మూగభాష పాకంలో - నా వయసును ముంచీకు పిల్ల
నీ అచ్చతెలుగులోని గొప్ప - అందులో నను గుంజీకు పిల్ల
తీపి తెలుగు శబ్దాలతో - నా గుండెలు గుద్దీకు మళ్ల
పిల్ల మనవలూ మనవరాళ్లు పటాలమంతా వచ్చి చేరి :
వోలెనాయనమ్మా! యెవురీయన?
భయ్యమే ఈన్నిసూత్తే..
వోలెముసిలీ!... ఓలమ్మా! యెవురీ ముసిలాయన?
భయమ్మే ముసిలోడ్ని చూస్తె...
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|