|
|
Articles: Devotion | మహా శివరాత్రి మహత్యం - Site Administrator
| |
ఆ జ్వాలా స్తంభం ఆద్యంతాలు కానరాక విరాజమానంగా ఉంది. అటు ఆకాశంలోకి ఇటు పాతాళంలోకి విస్తరించి ఉంది. విష్ణువు వెంటనే వరహా రూపం ధరించి భూమిని తవ్వుతూ కిందికి వెళ్ళసాగాడు. బ్రహ్మ హంసనెక్కి ఆకాశంవైపు బయలుదేరాడు. జ్వాలాస్తంభం ఆదిని చూసేందుకు హరి, అంతం చూసేందుకు బ్రహ్మ ప్రయాణిస్తున్నారు. హరి ఆదిని కనుక్కోలేక ఆ అద్భుతం హర విలాసమని గ్రహించి వెనక్కు మరలాడు.
ఆకాశం వైపు వెడుతున్న బ్రహ్మకు - ఆకాశం నుంచి జారిపడుతున్న మొగలిపువ్వు కనిపించింది. దాన్ని చూసిన బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చింది. దాని సాయం కోరాడు. మొగలి పువ్వు సాయం చేయడానికి సమ్మతించింది. 'నువ్వు శివుని శిరస్సు నుంచి వస్తున్నావనుకుంటున్నాను. నాకో మాట సాయం చెయ్యాలి. నేను ఈ జ్వాలా స్తంభం అంతాన్ని చూసానని నువ్వు సాక్ష్యం చెప్పాలి' అని అడిగాడు బ్రహ్మ. సరేననింది మొగలిపువ్వు.
బ్రహ్మ, మొగలి పువ్వు ఇద్దరూ కిందికి దిగారు. విష్ణువు కూడా కింది నుంచి భూమి ఉపరితలానికి వచ్చి తన వరహా రూపాన్ని విడిచి మామూలు రూపాన్ని ధరించాడు.
'మీ ప్రయత్నాలు ఫలించాయా? ఈ జ్వాలా స్తంభం ఆద్యంతాలు కనిపించాయా?' అని అడిగాడు పరమేష్టి.
జ్వాలా స్తంభ రూపంలో ఉన్న శివలింగం ఆదిని తను చూడలేకపోయానని హరి ఓటమిని అంగీకరించాడు. కానీ తను శివలింగం అంతం చూశాననీ, అందుకు ఈ మొగలిపువ్వే సాక్ష్యమనీ చెప్పాడు. మొగలిపువ్వు కూడా బ్రహ్మ శివలింగం అంతాన్ని చూశాడని కూట సాక్ష్యం పలికింది. కానీ నిజానిజాలు శివుడికి తెలుసు. వెంటనే జ్వాలా స్తంభంలో ప్రత్యక్షమై హరి, బ్రహ్మలతో -'హరి ఓడినా నువ్వు సత్యాన్ని చెప్పావు. బ్రహ్మ విజయం కోసం,ఆది పురుషుడు కావాలన్న స్వార్ధంతో, వ్యామోహంతో అసత్యం చెప్పాడు. అందుకే బ్రహ్మకు ఆలయాల్లో పూజ లేకుండా చేస్తున్నాను. విష్ణువుకు నాతో సమానంగా ఆలయాల్లో పూజలు, పర్వదినాల్లో ఉత్సవాలూ జరుగుతాయి' అని వాక్రుచ్చాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|