|
|
Articles: My Thoughts | శేషేంద్ర వారసులెవరు? - Mr. Sarma Guntur Satyaki
| |
'ఒకనాటి దీపాల సమూహాలన్నీ పోగా
ఏకాకిగా ఉన్న దీపకాంతిలో
మౌనస్తంభాల్ని అడుగుతాను
ఈ ఉనికి విసుగు నుంచి
నన్ను రక్షించలేరా? అని.
ఎక్కడికీ కదలకుండా
అక్కడే ప్రతియేడూ పూచే గుల్మొహర్ లని అడుగుతాను
నన్ను రక్షించలేరా? అని.
అందరూ నా కంటే గొప్పవనుకునే
అత్యున్నత భవనకుడ్యాల్ని అడుగుతాను
ఎప్పుడూ తమ గొప్పదనం చాటుకుంటూ
ఒకే చోట పడి ఉన్న వెనీషియస్ ఫర్నీచర్‌ని అడుగుతాను
ఈ ఉనికి విసుగు నుంచి రక్షించలేరా? అని
అన్నీ దీనస్వరంతో చెబుతాయి
'మేమూ నీలాగే మారని దృశ్యాలు చూస్తూ
వందేళ్ళ నుంచి పడి ఉన్నాం
నీకంటే పాత ఖైదీలము'
(శేషేంద్ర, జనవంశం, పే.80-81, 1993)
1994లో వచ్చిన నాన్న మొట్టమొదటి 'బయోగ్రఫీ' (హిందీలో) 'రాష్ట్రేందు శేషేంద్ర' - అశేష్ అయామ్ - డాక్టర్ విక్రాంత్ వశిష్ట్ రాశారు. అందులో ఈ అంశాలనే సూక్ష్మంగా స్పృశిస్తూ 'సోనేకే పింజరేమే పంఛీ' (బంగారు పంజరంలోని పక్షి) అని అన్నారు. ఆయన దిగజారుతున్న ఆరోగ్యంతో ఆందోళన చెంది, ఇందిరా ధన్ రాజ్ మీద వత్తిడి తేవాలనే ఉద్దేశంతో 2002లో అప్పుడున్న 'జనహర్ష 'వారి 'విజయవిహారం' మాసపత్రికకు రెండు క్యాసెట్ల నిడివిగల మౌఖిక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తనదనంతరం వాళ్ల ఆఫీసులో జరిగిన గొడవల్లో ఆ క్యాసెట్లు గల్లంతయ్యాయాని జనహర్ష వాళ్ళన్నారు.
ఆరోగ్యంతో ఉన్నప్పడే నాన్నను ఇంటికి తెచ్చేసుకుందామనుకున్నాను. కానీ శవాన్ని కాటికి చేర్చి నేను ఇల్లు చేరుకోవాల్సివచ్చింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|