|
|
Articles: TP Features | స్విస్ ఖాతాల గుట్టు రట్టు - Mr. Narsing rao D
| |
విషాదకరమైన విషయమేమంటే ఈ స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వారు తమ బ్యాంక్ కోడ్ నెంబర్లను వారసులకు అందించకుండా చనిపోయిన పక్షంలో ఆ సొమ్మంతా వృథాగా బ్యాంకు ఖాతాలోకి చేరిపోతుంది. ఒక రహస్య ఖాతాదారుని వారసులు వచ్చి సరైన సాక్ష్యాధారాలను చూపించలేని పక్షంలో, స్విస్ బ్యాంక్ 7-10 సంవత్సరాలు వేచి చూసి ఆ సొమ్మును తన ఖాతాలోకి మార్చేస్తుంది. స్విస్ అకౌంట్లన్నిటినీ కోడ్స్ ద్వారానే నిర్వహిస్తారు. అందుకోసం పాస్ పోర్టు, దాని నెంబరు సాక్ష్యాలుగా కావలసి ఉంటుంది. కొందరు వ్యక్తులు స్విట్జర్లాండుకు ప్రయాణించేటపుడు, కాలం చెల్లిన పాస్ పోర్టులతో ప్రయాణించడంలోని మర్మమిదే. యూరప్ మొత్తంలో జ్యూరిచ్ నగరంలోని ట్రామ్ లపై మాత్రమే హిందీ భాషలో రాసిన బోర్డులుంటాయి. బాలివుడ్ తో జ్యూరిచ్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ బ్యాంక్ ఖాతాదారుల హడావుడి కూడా ఇందుకు కారణమైందనడంలో సందేహం లేదు.
స్విస్ బ్యాంక్ రహస్య ఖాతాల్లో 500 నుండి 1,400 బిలియన్ డాలర్లున్నట్లు అంచనా. అదే సమయంలో టెర్రరిస్టులు వర్జిన్ ఐలాండ్స్, బహమాస్ లాంటి దేశాల బ్యాంకుల్లో కూడా వేల కోట్ల డాలర్లు దాచుకున్నారు. ఈ సొమ్మంతటినీ వెనక్కి తెప్పించేందుకు భారత్ కృషి చేయవలసి ఉంటుంది. మానవతా దృక్పథంలో పలు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఆ సొమ్ముకు స్విస్ బాండ్లను జారీ చేయవలసి వస్తుంది. ఈ చర్య మన విదేశీ మారకద్రవ్య నిల్వలను గణనీయంగా పెంచేందుకు ఉపకరిస్తుంది. మౌలిక సదుపాయాల పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం విదేశాల్లో దాచుకున్న సొమ్ము వివరాలను కూడా చూపించే విధంగా మన ఎలక్షన్ అఫిడవిట్లలో ఒక కాలమ్ రూపొందించాలి. అయితే మన రాజకీయ నాయకులు తమ అక్రమ సంపాదనను తెలియజేయరన్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్ లో తప్పుడు అఫిడవిట్లను దాఖలు చేయకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది. ఈ డిపాజిట్ల వలన యావత్ భారత దేశంలోని పన్ను వసూళ్లకు తీవ్ర విఘాతం కలిగింది.
తీవ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు ఈ రహస్య ఖాతా విధానం బాగా ఉపకరిస్తోంది. నిధుల మూలాలు సరిగా తెలియకపోవడం వల్ల తీవ్రవాదులకు నిధులు సులభంగా అందుతున్నాయి. భారతదేశంలోని తీవ్రవాద కార్యకలాపాల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. ఎంత తక్కువ పారదర్శకంగా ఉంటే, పౌర సమాజాలకు అంత ఎక్కువ ప్రమాదం వాటిల్లుతుంది. అందుకోసం ఇలాంటి రహస్య ఖజానాలు బహిర్గంత కాకతప్పదు. ప్రపంచ వాణిజ్య, ద్రవ్య పరమైన లావాదేవీలకు ఈ రహస్యం బ్యాంకింగ్ విధానం తీవ్ర విఘాతాన్ని కల్గించడం మూడవ అతి ముఖ్యమైన విషయం. గ్లోబల్ పైనాన్స్ లావాదేవీలు, దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య లావాదేవీలు ఈ రహస్య బ్యాకింగ్ విధానం వల్ల నిరుపయోగమవుతాయి. ఇలాంటి విధానాన్ని రద్దు చేసేందుకు భారత దేశం చొరవ తీసుకోవాలి. దానివల్ల ఆప్రికా, లాటిన్ అమెరికా మూడవ ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలకు చాలా ఉపకరిస్తుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|