|
|
Articles: TP Features | 'ఉపా' సర్కార్ ఫీట్లు, పాట్లు! - Mrs. Aravinda Desai
| |
మెరుగైన డేటా ఇన్ స్ట్రుమెంటే,న్, విశ్లేషణ, మానవ వనరుల కోసం రూ. 1000 కోట్ల పెట్టుబడి ద్వారా భారత వాతావరణ శాఖ (ఐఎండి)ని ఆధునికీకరించడానికి చేపట్టిన ప్రణాళిక ఫలితాల కోసం కూడా దేశం నిరీక్షిస్తున్నది. మెరుగైన వాతావరణ సూచనలలో మొదటిది 2010లో కామన్వెల్త్ క్రీడోత్సవాల జరిగే సమయానికి రావచ్చు. సైన్స్, ఇంజనీరింగ్ రీసర్చ్ బోర్డ్ (ఎస్ఇఆర్ బి) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉన్నత స్థాయిలో ఆలోచించడానికి, వివిధ వైజ్ఞానిక విభాగాల మధ్య సమన్వయంతో వ్యవహరించడానికి మన దేశానికి 'సూపర్' మేధో సంస్థ అవసరమని ప్రభుత్వం వాదించి మరీ ఈ కొత్త వైజ్ఞానిక నిధుల సంస్థను ఏర్పాటు చేసింది. అయితే, ఈ బోర్డు నిజంగా తనకు నిర్దేశించిన ప్రకారం పని చేస్తుందా లేక ఏ ఇతర ప్రభుత్వ సైన్స్ నిధుల సంస్థల రీతిలోనే పని చేస్తుందా అనేది కాలమే చెప్పగలదు.
తన పదవీ కాలం ముగియబోతున్నందున యుపిఎ ప్రభుత్వం ప్రైవేట్ టెక్నాలజీ సంస్థలలో ఈక్విటీ వాటాలు కలిగి ఉండేందుకు అకడమిక్, ప్రభుత్వ నిధులు అందే పరిశోధకులను అనుమతించేందుకు నిబంధనలలో మార్పులకు ఆమోదముద్ర వేసింది. లాబ్ స్థాయి టెక్నాలజీలను మార్కెట్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఇది ప్రోత్సాహకం కాగలదు. రానున్న సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలు, లేబరేటరీల నుంచి పరిశ్రమకు టెక్నాలజీ బదలాయింపును ఇది మెరుగుపరచగలదు.
పుణెలో వాతావరణ మార్పు కేంద్రం, ఫరీదాబాద్ లో ఆరోగ్య శాస్త్రాలు, టెక్నాలజీ కేంద్రం, కల్యాణిలో మెడికల్ జెనోమిక్స్ సెంటర్ వంటి కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఉన్నత స్థాయి సైన్స్, టెక్నాలజీ ఉపయోగాల గురించి ఆశలను పెంచుతున్నాయి. అయితే, వాటికి పని తీరును గ్రేడ్ లను నిర్ణయించే ప్రక్రియ ఇంకా అమలులోకి రావలసి ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|