|
|
Articles: TP Features | తెలుగుభాష రక్షాబంధనం - Mr. Tirumalarao Jayadheer
| |
ఈ సంత డిసెంబర్ 24న ప్రారంభమై జనవరి ఒకటి రెండు తేదీల్లో ముగుస్తుంది. ప్రతి ఏడు నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన స్థలంలో మందుల కులవారి పంచాయతీ జరుగుతుంది. ఈ పంచాయతీలో కులతప్పులు, విడాకులు, ఆస్తి తగాదాలు, భూవివాదాలపై తీర్పు చెబుతారు. ఇక్కడ ఆ రెండ్రోజులు సరిపోకపోతే ఔరంగాబాదు జిల్లాలో కాముని పండగ రోజున 'మడి' గ్రామంలో జరిగే పంచాయితీలో కలుసుకుంటారు. ఆనాటికీ తీర్పు రాకపోతే పూనే జిల్లాలో సంక్రాంతి పండగనాడు 'జొజోరి' గ్రామంలో తిరిగి కలుసుకుంటారు. ఆలోగా రెండు వర్గాలవారు ఏదో ఒక తీర్పు చేస్తారు. అందుకు ఇరుపక్షాలు అంగీకరిస్తాయి. అదీ వారి పంచాయతీ విధానం. ఈ విధానాన్ని చూడ్డం ఆసక్తిగా ఉంటుంది. దాన్ని పరిశోధించవలసిన అవసరం ఉంది. ఐతే ఈ పంచాయితీ వివిధ కులాలవారు వివిడిగా జరుపుతారు.
కాని, రోజులవారీగా సాగే ఈ మందుల వారి పంచాయితీ తెలుగు - మరాఠీ భాషలో జరుగుతుంది. ఎందుకంటే ఈ మందులవారు అచ్చు తెలుగువాళ్ళు. వీరిని మహారాష్ట్రలో 'వైద్యువార్' అని అంటారు. రెండు మూడు వందల మంది మధ్య జరిగే పంచాయితీలో ఇరువర్గాల వారు కూచుంటారు. వాళ్ళ మధ్య రక్తపాతం జరుగుతుందా అనేట్లుగా మాటలతో పోట్లాడుకుంటారు. తీవ్రమైన వాగ్వివాదం చెలరేగుతుంది. అలా కోపంతో ఊగిపోయినప్పుడల్లా వారు తెలుగులోనే మాట్లాడుతారు. వారు చూడ్డానికి మరాఠాల్లా పాగాలు, అంగీలు ధరిస్తారు. కాని వారి నోట చక్కని తెలుగు భాష తొణికిసలాడుతుంది. పంచాయితీ అయిపోయాక కుల పెద్ద అయిన ముకుందరామ్ చౌహాన్ ను కదిలించి చూశాను.
అతను ఇలా చెప్పాడు.
గొల్లకొండ (గోలకొండకోట) మర్రిమాను దగ్గర మా కుల పెద్దలున్నారు. అక్కడి నుండి ఇక్కడకు పంపించారు. ప్రజలకు మందులు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడాలి మేం. అది మా వృత్తి. అందుకే మందులవారు అంటారు మమ్మల్ని. ఈ మరాఠా దేశంలో వారి భాష ప్రకారం మమ్మల్ని వైద్యువార్ అంటారు. మందులు ఇచ్చి పానాలు కాపాడే మాకు ఆకలితో సచ్చే రోజులొచ్చినయి. అందుకే మాలో చాలామంది ఆ వృత్తి మాని బోళ్ళు (వంట పాత్రలు) రకరకాల ఇనుప పాత్రలు చేసి అమ్ముకుంటున్నాం. ఏ పని చేసినా మేం మా కుల కట్టుబాట్లు పోనిచ్చుకోలేదు. మాదంతా తెలుగువాళ్ళ ఆచార సంప్రదాయాలే. ఈనాటికి ఇట్లున్నం. మమ్మలని అడిగినవాళ్ళే లేరు. మా బతుకు మేం బతుకుతున్నాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|