|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
యూపీ ఎన్నికల్లో 70 ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేసినా మాయావతి కేవలం 28-30 శాతం ఓట్లతో ముఖ్యమంత్రి కాగలిగింది. మాయావతి పార్టీ అభ్యర్థులు పలువురు డిపాజిట్లు కూడా పోగొట్టుకొన్నారు. మూడవస్థానంలో ఉన్నవారు దాదాపు 168 మంది డిపాజిట్లు పోగొట్టుకున్నారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఏర్పడడానికి తగిన వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొన్నది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 6, 7 రాజకీయ పార్టీల నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బిజేపి, బీఎస్పీలు తలా 2-3 శాతం ఓట్లను చీల్చుకొంటాయి. లోక్ సత్తా 5-10 శాతం ఓట్లను పొందుతానని చెబుతున్నది. మాదిగలు తమ బలం చూపించడానికి దాదాపు 160 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఇదిలా ఉండగా, పూలే, సామాజిక న్యాయం పేరుతో బీసీ ఓటర్లలో స్పృహ పెంచారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్తగా ఓటు బ్యాంకును మెరుగుపరుచుకోలేదు. సరికదా తెలంగాణావాదుల ఓట్లు, మాదిగలు, బలిజలు, కొన్ని ముస్లీం ఓట్లను మరికొన్ని బీసీల ఓట్లను కోల్పోయింది. మాల కులస్థుల ఓట్లు కూడా మొత్తంగా కాంగ్రెస్ పడవు. మొహమాటాలకు, ఒత్తిడులకు లొంగి భీమిలీ, వరంగల్ వెస్ట్ లాంటి స్థానాల్లో స్థానికేతరులను బరిలో దింపి కొన్ని స్థానాలను చేజేతులా చేజార్చుకున్నది.
రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి మంత్రం పనిచేయకపోతే గెలిచే సీట్లను కాదు డిపాజిట్ దక్కని సీట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది. అప్పుడు యూపీ, బీహార్, బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో వలే ఈ జాతీయ పార్టీ రాష్ట్రంలో మూడవస్థానంలో సర్దుకునే పరిస్థితి రావచ్చు. పెద్ద రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిని పడిపోయిన ఉదంతాలు భారత రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్స్ నుసోనియాను, రాహుల్ ను యూపీఎ పనితనాన్ని చూసి అదనంగా ఏమీ ఓట్లు రాకపోవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ లో అన్నీ తానే అయి నడుపుతున్న రాజశేఖర రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు సానుకూలంగా స్పందించక పోతే రాష్ట్రంలో వారికి గడ్డు పరిస్థితి ఎదురు కావచ్చు.
మహా కూటమి ఏమవుతుంది?
కూటమి కట్టిన చంద్రబాబు నాయుడు కదనోత్సాహంతో నేనే ముఖ్యమంత్రిని అన్నట్లు మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో మిత్రుల బల బలాలు చూసుకుంటే, అవి తెలుగుదేశంలో కలిశాయి కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని సూత్రీకరించవచ్చు. కానీ గత కాల పరిస్థితి వేరు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు వేరు. చంద్రబాబు ఏం చేశాడో, గెలిస్తే ఏం చేయగలడో, ఎవరికి చేయగలడో అనే విషయమై రాష్ట్ర ఓటరుకు స్పష్టత ఉంది. మహాకూటమిలో 51 మంది కమ్మవారికి 70 మంది రెడ్లకు, 13 మంది వెలమలకు, ఏడుగురు కాపులకు టిక్కెట్లు ఇచ్చి, బీసీలకు కేవలం 65 సీట్లు మాత్రమే ఇచ్చాడు. 2004 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చినన్ని టిక్కెట్లు కూడా ఈసారి ఇవ్వలేదు. బీసీలకు వందపైగా సీట్లు ఇస్తానని టిక్కెట్ల పంపిణీకి ముందు వెల్లడించి ఆచరణలో మాట తప్పాడు. కూటమికి అధికారం వస్తే కమ్మ, వెలమలకు పెద్ద పీట పడుతుందనే విషయం ఓటరు గ్రహించగలడు. ఈ కారణం వల్ల చంద్రబాబు గెలుపును ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి వుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|