|
|
Articles: TP Features | భాషాభివృద్ధే పురోగమనం - Site Administrator
| |
భాష స్వరూపం గురించి కాకుండా భాషలో చెప్పే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. భాష నిర్జీవమనీ, అది ఎలా చెబితే అలా నడుచుకుంటుందని చాలామంది భావిస్తారు. అంతేకాదు, భాషా విషయానికి వస్తే మానవుడినీ, సంస్కృత భాషనీ కాదని భాష పండితుల సృష్టి అన్నట్లుగా ఆలోచిస్తారు. సంస్కృత భాషని అనువదించే రచయిత భాషని సృష్టిస్తాడమని అనుకుంటారు. నిజానికి ఈ భాష కృతకమైనది. జన వ్యవహారానికి దూరమైనది. అది కేవలం పాఠ్యంలో మాత్రం గోచరిస్తుంది. అలాంటి భాషను దృష్టిలో పెట్టుకుని మన ఆలోచనలు సాగినంత కాలం వాస్తవ సమాజ భూమికను విస్మరిస్తాం. ఇవ్వాళ్టి వరకు మనం కాల్పనిక భావనలకు ఇచ్చే ప్రాధాన్యత చూస్తుంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా అని అనిపిస్తుంది. అందుకే భాష విషయమై దాని పుట్టుక, అభివృద్ధి గురించి ఒక సాధారణీకరణను ఆమోదింపజేయడం అవసరం. ఈ సాధారణీకరణపైనే ముందు ముందు ఆయా భాషా వికాసాల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. భాష గురించి నానా రకాల అభిప్రాయాలు విశ్వాసాలు ఉంటే గందరగోళం తయారవుతుంది.
ఐతే ఇది సాధ్యమా...
మామూలు ప్రజలు భాష పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉన్నారా లేదా అనేది పరిశోధించవలసి ఉంది. ఉంటే అది ఎలా ఉందనే విషయం గురించి ఆలోచించాలి.
చదువుకున్న శిష్టవర్గం కూడా భాషకి శాస్త్ర ప్రతిపత్తి ఉందని ఒప్పుకున్నా వారు భాష పుట్టుక పట్ల శాస్త్రీయ ఆలోచనా విధానం కలిగి ఉండరు. అందుకు కారణం వారి సామాజిక అంతస్తు ఒకవైపు భాషని శాస్త్రీయ రీతిలో, హేతుబద్ధ విధానంలో అధ్యయనం చేసినా భాషకి ఒక కల్పిత మహత్తుని అంటగట్టడం జరుగుతుంది.
దీనికి మరోవైపు ప్రగతిశీల తెలుగు మేధావులు, రచయితలు కూడా భాష చుట్టూ కల్పించబడిన పురా లక్షణాలను ఛేదించడానికి నిర్మాణాత్మకంగా ప్రయత్నించలేదు. భాష గురించి రచయితల సంఘాలు ఆలోచించాలనీ, భాషపై ప్రజలను చైతన్యపరచాలనే ఆలోచన వారికి కలగలేదు. అందుకే చర్వితచర్వణంగా భాషని ఆలోచించారే తప్ప దాని లోతుల్లోకి పోలేదు. అందువల్ల భాష చుట్టూ అల్లుకున్న కల్పన బద్ధలవలేదు. అలా కాకుండా కేవలం ప్రజలు ఉపయోగించే భాషని తమ ప్రయోజనాల మేరకే గైకొనడం జరిగింది. అంతే తప్ప ప్రజల భాష స్వరూప స్వభావాలు, భాషా సృజనలో ప్రజల పాత్ర ఎలా ఉందో పరిశీలనలు, పరిశోధనలు జరపలేదు. ప్రజలు చరిత్ర నిర్మాతలనే యాంత్రిక దృక్పథంలాగే, ప్రజల ఉత్పత్తి సంబంధాల నుండే భాష పుడుతుందనే పెద్దల మాటని తెలుగు సమాజానికి వర్తింపచేసి చెప్పలేకపోయారు. అంటే సిద్ధాంత వాక్యాలను అనువదించుకున్నామే తప్ప వాటిని అన్వయించి చూపలేదు. స్థానిక ప్రజలు, సమాజాల దృక్కోణాల్లోంచి తత్వశాస్త్రం అభివృద్ధి చెందలేదు. సాధారణీకరించిన పరభాషా, సమాజాల మేధావుల ఆలోచనలను చిలుక పలుకుల్లా పలకడం వల్ల ఎక్కువగా ఉపయోగం లేదు.
అందువల్ల, రాజకీయంగా కొంతవరకు చైతన్యవంతులైన ప్రజలు భాషా భావవాదం నుండి బయట పడలేదు. ఇది సామాన్య ప్రజలకే కాదు - రాజకీయ శిష్టవర్గాల పెద్ద నాయకులకీ వర్తిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|