|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
జేబు నిండా ధనం ఉన్నా ఖర్చుపెట్టటానికి వెనుకాడని పరిస్థితి అయినా ప్రయోజనం శూన్యం. అప్పుడు సుమారు 11 గంటలు దాటింది. ఇక వెనక్కి వెళ్ళటం తప్పదు. లేదా దేవుని తలుచుకుని చితాభస్మాన్ని నదీగర్భంలో మంత్రయుక్తం కాకుండా నిమజ్జనం జరుపుకోవాలి. ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు అని ఒకరితో ఒకరు బయట అనుకొంటుండగా అకస్మాత్తుగాఒక వ్యక్తి ఎటునుంచి వచ్చాడో తెలియదు గాని వీరిని పలకరించి 'ఏమిటీ పురోహితుడి కోసం చూస్తున్నారా! మీరు ఎంత చూసినా దండగే ఇక్కడ ఎవరూ దొరకరు. ఈ రోజు పైలాన్ శివాలయంలో కోటి బిల్వార్చన. ఇంకా రుద్ర యాగం, చండీయాగం మొదలైన పుణ్యకార్యలు ఎన్నో నిర్వహిస్తున్నారు. సుమారు 300 మంది దీక్షాబద్ధులై యాగ క్రతువుకు వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు మీకు దొరికి మీ కార్యక్రమాలను జరిపించగలరు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ కెనాల్ బ్రిడ్జీ దాటిన తరువాత శివాలయం కనబడుతూనే ఉంటుంది. అక్కడకు తొందరగా వెళ్ళండి' అని దారి చూపించి అతను వెళ్ళిపోయాడు.
ఈ లోపల రామయ్య గారి కుమారులు వెతుక్కుంటూ మేనమామతో కలిసి వీరి వద్దకు వచ్చారు. అప్పుడు వీరికి అపరిచిత వ్యక్తి తెలిపిన విషయం చెప్పగా అందరూ ఆనందంతో శివాలయం వద్దకు వెళ్ళేందుకు బయలుదేరారు. ఇదంతా క్షణకాలంలో జరిగింది. ఈ విషయం తెలిపిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపేందుకు అందరూ అతని కోసం నలుదిక్కులా వెదికారు. కనిపించలేదు. ఇది కచ్చితంగా బాబా లీలే అని నిశ్చయించుకుని వారు చెప్పిన దిశగా వెళ్ళారు.
ఆ తరువాత మరో అద్భుతం జరిగింది. కారులో శివాలయం వద్దకు వెళ్తుండగా శివాలయం దరిదాపుల్లో ముగ్గురు విభూది ధారణతో తేజస్సు గలిగిన ముఖవర్చస్సుతో ఎదురుపడ్డారు. వారిని చూడగానే కారు ఆపి వారిలో ఎవరైనా కార్యక్రమం జరిపించగలరేమో అని అడగ్గా అందుకు సమ్మతించలేదు. తాము యాగ కంకణధారులమని తాము చేయలేమని తెలిపారు. ఇంకా ఇలా తెలిపారు. వారిని శివాలయంలో సంప్రతించగా అక్కడ 300 మంది బ్రాహ్మలు ఉన్నారు. వారిలో ఒకరి పేరు దత్తు అని అతను మాత్రమే మీ కార్యక్రమం చక్కబెట్టగలడని తెలిపారు.
వారు చెప్పిన ప్రకారంగా వీరంతా కలసి దత్తు కోసం శివాలయం వద్దకు వెళ్ళారు. ఈ లోగా దారిలో చాలా మంది పురోహితులు కనిపించారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఈ కార్యం జరిపేందుకు సంసిద్ధులు కాలేదు. ఎందుకంటే వారంతా యాగ బ్రహ్మలు. శివాలయ ప్రాంగణంలోనికి వెళ్ళటమా మానటమా అని సంశయంతో అందరూ వెలుపలే నిలబడ్డారు. నలు దిక్కులా పరికించి చూడగా వీరందరికి భయాందోళనలు కలిగాయి. ఎందుకంటే ఆ రోజు శివాలయానికి ఎదురుగా ఉన్న పవిత్ర స్నానఘాటులో సపిండీకరణలు స్నాన సంకల్ప పిండ తర్పణ నిమజ్జన కార్యక్రమాలు ఆ రోజున నిర్వహించరని అధికారిక ప్రకటన ఉంది. ఆ ప్రకటన చూడగానే వీరంతా నీరుగారిపోయారు. అయినా చివరి ప్రయత్నంగా శివాలయంలో దత్తును కలిసి సంప్రతించాలని అనుకొని వారిలో ఒకరు మందిరంలోనికి ప్రవేశించి దత్తు కోసం వాకబు చేసి ఆయనని కనుగొనగలిగారు. ఆయనతో ఈ విషయమై సంప్రతించగా ఆయన ఈ రోజు మాత్రం ఈ కార్యక్రమాలు నిలిపివేశారని అందువల్ల తానేమీ చేయలేనన్నాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|