|
|
Articles: TP Features | నేతిబీరలా ఫిరాయింపు చట్టం - Site Administrator
| |
1967-72 మధ్య స్వతంత్ర అభ్యర్థులు 2000 మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఒక సభ్యుడు ఐదేళ్ళలో ఐదు మార్లు పార్టీలు మారిన సందర్బాలు ఉన్నాయి. 1950లో 23 మంది, 1957-67 మధ్య 419 మంది కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించగా 97 మంది కాంగ్రెస్ పార్టీలో వారు బయటకు పోయారు. 1967-68లో 175 మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో నుండి వెళ్ళిపోయారు. 139 మంది కాంగ్రెస్ లోకి వచ్చారు. 1967-71 మధ్య 32 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల వల్ల నిలబడ్డాయి లేదా కూలిపోయాయి. 1967 లో 500 మంది ఇలా పార్టీలు మారారు. ఈ సందర్భంలోనే 'ఆయారాం, గయారాం' నానుడి పుట్టుకొచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పి.వి.నరసింహారావు హయాంలో మైనార్టీలో పడిపోగా అనైతిక, చట్ట విరుద్ధమైన రీతిలో ఆయన ప్రభుత్వం నిలబడిందో అందరికీ తెలిసిందే. అవసరం లేకున్నా పార్టీని బలహీనపరచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పదకొండు మంది ఎం.ఎల్.ఏ.లను ఆ పార్టీ నుండి విడదీశారన్న అపవాదు ఉండనే ఉంది. నైతికత గురించి ఆలోచించని శనిగరం సంతోష్ రెడ్డి, మందాడి సత్యనారాయణ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి పార్టీ కన్నా కులం ముఖ్యం అనుకున్నట్లున్నారు.
బండారు శారారాణి, దుగ్యాల శ్రీనివాసరావు లాంటి వారు పైరవీలు, అధికార పార్టీతో స్నేహం ముఖ్యం అనుకున్నారు. మొన్నటికి మొన్న మన్మోహన్ సింగ్ సర్కార్ ఇలాంటి అనైతిక పద్ధతిలోనే పడిపోకుండా నిలబడిందన్నది జగమెరిగిన సత్యం. మంద జగన్నాథం, ఆలె నరేంద్ర, ఆదికేశవులు నాయుడు అంతరంగాలకు వారు చేసింది అన్యాయం, అనైతికం అని తెలియదా? వారు పార్టీ ఫిరాయింపు దారుల క్రిందికి రారా? వారి ఫిరాయింపునకు కాంగ్రెస్ షరాబులు ఎంత ఖరీదు కడతారు? సైద్ధాంతిక రాజకీయాలను నమ్మి అనుసరించే రాజకీయవాదులు కొద్ది మందే ఉంటారు. వారికి ఏ చట్టాలూ అవసరం లేదు. ప్రజలు ఏ పార్టీకి ఓటు వేస్తారో గెలిచిన అభ్యర్థి ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉండాలి అన్నది సహజ న్యాయం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఇదే స్ఫూర్తితో నిర్మితమైంది. ఓటరు తీర్పును గౌరవించే నాయకుడు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి లేదా రాజీనామా చేసి మళ్ళీ ఓటరు తీర్పు కోరాలి గాని చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు. కాని భారత, రాజకీయ నాయకులకు అది సునాయాసంగా కుదురుతున్నది. నైతికత అనేది కనీస ప్రాధాన్యత లేని అంశంగా మారింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|