|
|
Articles: TP Features | మూడో ఫ్రంట్ తో ముప్పు - Site Administrator
| |
ఇక అదీ ఇదీ కాకుండా మాయావతి, చంద్రబాబు, కమ్యూనిష్టు బాబులు ఆశిస్తున్నట్టు తప్పుజారీ మూడవ ఫ్రంట్ మెజారిటీ సాధిస్తుందనే సంకేతం వెలువడిన మరుక్షణం మార్కెట్లు కుప్పకూలం తథ్యం. అవి తిరిగి ఆరు నెలల నాటి కనిష్ట స్థాయికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మూడవ ఫ్రంట్ వార్తకు మార్కెట్ లో ఇంత ప్రతికూలత ఉండేందుకు కారణం ఆ ఫ్రంట్ పార్టీల్లో ఐక్యత లేకపోవడం ఒకటైతే ఆ ఫ్రంట్ కు ఇంతవరకు కామన్ ఎజెండా లేకపోవడం మరో కారణం. ఈ ఫ్రంట్ లోని నాయకత్వానికి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయం పట్ల ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారం పట్ల, ఆర్థిక విధానాల పట్ల లేదన్న విషయం జగద్విదితం. అంతేకాక ఈ ఫ్రంట్ అధికారంలోకి వచ్చాక ఎంతకాలం కొనసాగుతుందో అన్న విషయం కూడా అనుమానమే. అందుకే ఎన్నికల ఫలితాలు ఈ థర్డ్ ఫ్రంట్ కు అనుకూలంగా వెలువడడం అంటూ జరిగితే ఇక మార్కెట్ పై ఆశలు వదులుకోవలసిందే. స్పెక్యూలేటర్లకు తప్ప ఇన్వెస్టర్లకు మార్కెట్లో స్థానం ఉండదు. షేర్లపై పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో ఎవరూ చెప్పలేని అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.
సాధారణ పరిస్థితుల్లో అయితే ఒక బరస్ట్ తర్వాత మళ్లీ బూమ్ రావడానికి 5 నుండి 7 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి రావడమంటూ జరిగితే ప్రస్తుతం బరస్ట్ తర్వాత వచ్చే బూమ్ కు కనీసం 10 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|