|
|
Articles: TP Features | నవ రసాల శ్రీశ్రీ - Site Administrator
| |
`కోపం తెచ్చుకోవడానికి ఈ లోకంలో ఎన్నో కారణాలున్నాయి... చుట్టూ ఉన్న ఈ సమాజ వ్యవస్థను చూస్తూ ఉంటే కోపం కాక మక్కువ పుట్టుకొస్తుందా? కొంతమంది మనుష్యులు నిర్లజ్జగా మన కళ్ళ ఎదుటనే చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఒళ్ళు మండుతుందా మండదా? నిజమేనోయ్! వాళ్ళనే గౌరవిస్తుంటే తప్పకుండా ఆగ్రహించవలసిందే కాని, నిదానంగా! నింపాదిగా' అంటారు. `వేణీ సంహారం' నాటకంలో భీముడు ఎన్ని టన్నుల రౌద్రావేశం ఉన్నా నిగ్రహం చూపించినట్లు - శత్రువుతో పోరాడవలసివచ్చినప్పుడు నింపాదిగా కోపం చేయడం విజయమంత్రమని సూచిస్తారు. ఉత్తమ సాహిత్యంలో కూడా ఎక్కడా ఎప్పుడూ ఏ రసమూ మోతాదును మించిపోదు అని ముగిస్తారు ఈ కథనం.
`అరవంలో కోడిగుడ్డు' అనే శీర్షిక గల రచన హాస్యరసానికి సంబంధించింది. ఇంగ్లీషు మీడియంలో చదివే రచయిత మనవడికి అరవంలో గుండుసున్నా మార్కులు వస్తుంటాయి. ఈ విషయం చెబుతూ శ్రీశ్రీ హాస్యంగా ఇలా అంటారు :
`... ఒక్క అరవంలో మాత్రం కోడిగుడ్లు పెడుతూ ఉంటాడు. ఇవి నిజమైన కోడిగుడ్లయితే ఎంత బాగుండును. నా ఆహార సమస్య కొంతవరకైనా తీరేదికదు అనుకొంటాను' అంటారు. ఈ వ్యాసంలో శ్రీశ్రీ అన్ని భాషలకీ రోమన్ లిపిని వాడటం గురించి చర్చించారు. వినోబా భావే దేవనాగర లిపిని భారతీయ భాషలన్నీ అమలుచేయాలని కోరారు. మరి ఈ కోరికను `కుప్పలుతెప్పలుగా పుట్టకొక్కుల్లాగ బయలుదేరుతున్న బాబాగార్లో, అమ్మవార్లో తమ మంత్రాల వల్లనో దేశమంతటా హిందీ లిపిని తీసుకుని వస్తే' బాగుంటుందంటారు. ఆ తర్వాత మనవడికి తెలుగు, అరవ వచ్చేట్లు కృషి చేసి విజయం సాధిస్తారు.
భయానక రసానికి చెందిన రచన `దైవభీతి'. `ప్రతిదినం దేవుడు లేడనడానికి నిదర్శనాలు కనబడుతూనే ఉంటాయి. అయినా ప్రజలు దేవుడ్నే నమ్ముకుంటూ ఉంటారు. ఎందువల్ల? భయం వల్ల' అంటూ ప్రారంభమౌతుంది ఈ రచన.
రచయిత మిత్రుడు రామయ్య సెట్టికి భార్య మీద అనుమానం. కొడుకు తెల్లగా ఉంటాడు. సోల్జర్ పేట ఆంగ్లో ఇండియన్ తో భార్య పోయి ఉంటుందని బాధ. సైన్సు ప్రకారం నల్లవారైన భార్యాభర్తలకు తెల్లపిల్లలు పుట్టవచ్చని రచయిత చెప్తాడు. ఈ విషయంలో సైన్సును నమ్ముతానంటాడు. కాని దేవుడంటే చచ్చేంత భయం!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|