|
|
Articles: TP Features | కౌంటరేది? ఎన్ కౌంటరేది? - Site Administrator
| |
బంద్ కు పిలుపునిచ్చి రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా సవాలక్ష ప్రయత్నాలు చేస్తారు. మావోయిస్టులు సైతం అలాంటి అంతరాయం, ఆటంకం కలిగించడానికి పూనుకున్నారు. రోడ్డుపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న స్థానిక పోలీసులపై విరుచుకుపడి మందుపాతరతో వీర ప్రతాపం చూపడం విప్లవ చర్యగానే పరిగణించవలసి రావడం వింతల్లోకెల్లా వింతగాక మరొకటి కాదు.
స్థానిక పోలీసుల విధులేమిటి?... కర్తవ్యాలేమిటి... శాంతి భద్రతలను కాపాడడం. అలా బంద్ సందర్భంగా రోడ్డుపై అడ్డంగా వేసిన వాటిని తొలగించడం కూడా ప్రజా వ్యతిరేకమైన చర్యగా ముద్రవేసి వారిని ఏకపక్షంగా కాల్చిపారేయడం ఏ రకంగా సాయుధ పోరాటంలో భాగమవుతుందో ఆ మావోయిస్టులకే తెలియాలి.
ఏ ఆరోపణతో (బూటకపు ఎన్ కౌంటర్లు) బంద్ కు పిలుపునిచ్చి ఆ బంద్ సందర్భంగా మావోయిస్టులు జరిపినవి అంతకన్నా దారుణమైన బూటకపు ఎన్ కౌంటర్లు అని తెలుస్తూనే ఉంది కదా? ఇందులో గోరంతల్ని కొండంతగా చేసే వైనం లేదు, వాస్తవాల్ని అవాస్తవంగా చిత్రించే తీరు లేదు, ఈ వాస్తవాలు ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవడానికి పత్రికలు-మీడియా అందుబాటులో ఉంది. మరి ఇలాంటి ఘటనల వల్ల రెడ్ కారిడార్ పరిధిలోని గిరిజన ప్రజల సాధికారత పెరుగుతోందా? వారి కొనుగోలు శక్తి హెచ్చిందా?... ఏ రకమైన పాజిటివ్ అంశం ఉబికి వచ్చింది?
గత సంవత్సరం (2008) ఏప్రిల్ లో దాదాపు ఇవే కారణాలతో దండకారణ్యం బంద్ కు పిలుపునిచ్చారు. అప్పుడు అంటే ఏప్రిల్ 2న జార్ఖండ్ లో మందుపాతర పేల్చి పదిమంది పోలీసులను గాయపరిచారు. మందుపాతరలను తట్టుకుని నిలిచే వాహనంలో ప్రయాణించడం వల్ల వారు గాయపడ్డారు తప్ప మామూలు వాహనమైతే వారి శవాలను సైతం గుర్తించడం కష్టంగా ఉండేది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|