|
|
|
|
Articles: My Thoughts | ఈ తెగులు పోతుందా? - Site Administrator
| |
పది సంవత్సరాల తరువాత మన విద్యావంతుల తెలుగు భాషాజ్ఞానం వార్తాపత్రికలు చదవడానికి మాత్రమే పనికి వస్తుంది. మిల్టను, వర్డ్సువర్తు, డికెన్సు మొదలైనవి బాగా ప్రచారంలోకి వచ్చి వాటిని చదివేవాళ్ళే కనబడతారు. కాని తెలుగు నవలలు,కథలు, కావ్యాలూ చదివేవాళ్ళుండరు. ప్రస్తుతం 25 సంవత్సరాల వయస్సులోపు యువత తెలుగు కథా సాహిత్యాన్ని కూడా చదవడం లేదు. అమెరికా ఇంగ్లీషు నవలలు తెగ చదివేస్తున్నారు.
విద్యావిధానంలో తెలుగు భాష పరిస్థితి ఇలా బలహీనంగా ఉండగా తెలుగు వృక్షం ఎలా నిలబడుతుంది? వేరు పురుగులనూ, ఎలుకలనూ నిర్మూలించి వేర్లను కాపాడుకోకుండా కొమ్మలకు పురుగు మందులూ, చీడమందులూ పిచికారి చేసి ఏమి లాభం?
మూడు అత్యవసరాలు
మనం చేయవలసిన మొట్టమొదటి పని ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లనన్నింటినీ తెలుగు కాన్వెంటులుగా మార్చాలి. నర్సరీ క్లాసు, ఎల్ కేజీ, యూకేజీలకు తెలుగు సిలబసును తయారుచేసుకోవాలి. కనీసం విద్యార్హతను నిర్ణయించి వారికి స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి తెలుగు కాన్వెంటులలో ఉపాధ్యాయులుగా నియమించాలి.
రెండవది - తెలుగు అక్షరాలను నేర్పడానికి ముందు మరే భాషా అక్షరాలనూ నేర్పకూడదు. ఇంగ్లీషు కాన్వెంట్లు అయినా తెలుగు కాన్వెంట్లయినా అక్కడ కేవలం మౌఖిక బోధనే తప్ప రాయడం ఉండరాదు. ఒకటవ తరగతిలోనే రాయడం ప్రారంభించాలి. తెలుగులో వాక్యనిర్మాణ పరిజ్ఞానం అబ్బిన తరువాతనే ఏ ఇతర భాషనైనా నేర్పాలి. అంటే కనీసం మూడో తరగతి తరువాత అన్నమాట.
మూడవది - తెలుగువాచకం ఏ క్లాసులోనూ, ఎట్టి పరిస్థితులలోనూ ఇంగ్లీషు వాచకం కంటే తక్కువ స్థాయిలో ఉండరాదు.
పై విధంగా విద్యావిధానంలో పునాది దశలోనే తెలుగును బలపరుచుకోకపోతే కొద్దికాలంలోనే తెలుగుభాష ముందు చెప్పినట్లుగా వార్తాపత్రికలు చదవడానికే ఉపయోగపడుతుంది. అంటే తెలుగు దుబ్బులు మిగులుతాయి. తెలుగువృక్షం కూలిపోక తప్పదు. అవునో కాదో ఆలోచించండి.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|