|
|
Articles: TP Features | అలెగ్జాండరే కుమారస్వామి! - Site Administrator
| |
ఇలాంటి పచ్చి అబద్ధాల్ని ఈయనలాంటి చాలామంది తెలుగు పెద్దలు మనస్ఫూర్తిగా నమ్మే చెప్తున్నారు. వాళ్ళకు పాఠాలు చెప్పిన గురువులు కూడా ఇప్పటిదాకా మనం చర్చించిన `చిలక పలుకులు' నమ్మినవాళ్ళే కాబట్టి!
`ద్రావిడ' పదాన్ని `తమిళ' పదానికి పర్యాయపదంగా చిత్రించి, చరిత్రని తమిళులకు అనుకూలంగా మార్చేకుట్ర కాల్డ్ వెల్ కాలానికే మొదలయ్యిందని నా భావన.
ఇంతకీ అలెగ్జాండర్ ని కుమారస్వామితో పోల్చడం వలన తమిళులు ఆశించిన ప్రయోజనం ఏమిటి?
- ప్రాచీన ప్రపంచ నాగరికతలన్నింటికీ తమిళులే మూలం అని నిరూపించటం.
- సుమేరియా, పర్షియా, ఇరాన్, ఇరాక్ లలోని దేవతా పురుషులంతా తమిళులేనని, వాళ్ళే భారతదేశంలో కూడా దేవతలుగా చెలామణిలో ఉన్నారని, వీళ్ళ పేర్లను సంస్కృతీకరించి - శివ, స్కంధ - ఇలా మార్చుకున్నారని ఒప్పించటం.
- ఈ నేల పుట్టక ముందు, రాయి రప్పా పుట్టక ముందే తమిళభాష పుట్టిందని అడ్డంగా బుకాయించటం!
ఇదంతా చదివిన తర్వాత - తమిళులు ఎంతో పకడ్బందీగా అలెగ్జాండర్ - స్కంధ కథని నడిపించారు గానీ, ఒక మౌలిక సత్యాన్ని మరిచిపోయారని అనిపిస్తోంది.
అలెగ్జాండర్ భారతదేశంలోకి వచ్చేవరకూ ఇక్కడ `స్కంధ' లేడు అనడం వలన, స్కంధతోనే తమిళులు భారతదేశంలోకి ప్రవేశించినట్లు అర్థం అవుతోంది. ఆ విధంగా క్రీస్తు పూర్వం 300 కన్నా పూర్వం భారతదేశంలో జరిగిన చారిత్రక సాంస్కృతికి పరిణామాలతో తమిళులకు ఎలాంటి సంబంధమూ లేదని అంగీకరించినట్టౌంతోంది!
ఇక్కడ తెలుగువాడు అడగవలసిన ప్రశ్న ఏమంటే, శివకుమారుడు కుమారస్వామిని తమిళులు హైజాక్ చేసి కేవలం తమిళ దేవుడిగా ఎలా చిత్రించుకోగలరని?
నన్నెచోడుడు కష్టించి రాసిన కుమార సంభవం ఓ అరవ దేవుడి కథా...? ఎంత అన్యాయం?
అలెగ్జాండర్ ఇండియాను నిజంగా జయించాడా? :
నిజానికి అలెగ్జాండర్ అడుగుపెట్టింది ఈనాటి పాకిస్తాన్ భూభాగంలోని పెషావర్ వరకే! జీలమ్ నది పశ్చిమతీరంలో అలెగ్జాండర్ సైన్యంతో విడిదిచేసి ఉన్నాడు. DIODORUS ప్రకారం, అతను అప్పటికే వెనక్కి వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయించుకుని ఉన్నాడు. తన అధీనంలోని పెషావర్ ప్రాంతానికి ఫిలిప్స్ ని తన ప్రతినిధిగా నియమించాడు.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|