|
|
Articles: TP Features | మరాఠీ- తెలుగు అనుబంధం - Site Administrator
| |
మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన పిదప అసెంబ్లీ మొదటి స్పీకర్ గా సయాజీ శీలం ఎన్నికయ్యాడు. ఆయన రాసిన `గీతాలాపన', రాజ్యాంగ పరమైన శబ్దకోశాన్ని తయారుచేసి అందించిన `పద నామకోశం', ప్రభుత్వ వాక్య ప్రయోగం మరాఠీ రాజనీతివేత్తలకు, సాహిత్యకారులకు అందించిన తొలి రాజకీయ గ్రంథాలు. డాక్టర్ వి.ఆర్.బుస్ రధ్ రాసిన `శివచరిత్ర', ఆశన్న ఈరబిత్తిని రాసిన 'నా జీవితకాల జ్ఞాపకాలు' 550 పేజీల గ్రంథం. వసంత్ పోరేడి రాసిన `అడవి', ఇంక్విలాబ్ జిందాబాద్, చంద్రముఖి, విద్యుత్ మాయాజాలం, `క్రికెట్ ఎలా ఆడాలి?', లోకమాన్య పత్రికకు విలేఖరిగా రాసిన వ్యాసాలు మరాఠీ సాహిత్యానికి తెలుగు సాహితీపరులు అందించిన ఆణిముత్యాలు. ప్రసిద్ధ తెలుగు రచయిత డాక్టర్ కేశవరెడ్డి `క్షుద్రదేవత' అనువాద గ్రంథం మరాఠీలో విస్తృతస్థాయిలో ప్రాచుర్యం పొందింది. డాక్టర్ అంబేద్కర్ (ఔరంగాబాద్) విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ నాగ్ నాధ్ కొత్తపల్లె, ప్రగతిశీల గ్రామీణ సాహిత్యానికి గొప్పసేవలు అందించిన కవి. శాంతారామ్ పార్ పిల్లేవార్ మరో ప్రగతిశీలకవి తెలుగువాడే.
నాటక రంగంలో షోలాపూర్ కు చెందిన తిప్పయ్య చిన్నయ్య నాదర్ గి `రాజా హరిశ్చంద్ర', `సుధావంశం ఓడిపోయింది', `రాజా రుక్మాంగధ్' సంగీత నాటకాలను తెలుగులోకి అనువదించి 1930లో రంగస్థలంపైకి ఎక్కించాడు. ఆయన కుమారుడు సిద్ధేశ్వరుడు - `బస్మాసురుడు', `ద్రౌపదీ వస్త్రాపహరణ' నాటకాలను తెలుగులో రాశాడు. ముంబయికి చెందిన ఈరబత్తిని లక్ష్మణ్ రావు `చంద్ర గ్రహణం, కులవంశ మరాఠా, శివ సంబవ్, శహశివాజీ, రాజసన్యాసం, ఆగ్రా నుంచి విడుదల, ప్రజాశాసనం, అమలుదారుడు, దేవమనిషి లాంటి మరెన్నో నాటకాలలో ప్రధానపాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన కళాకారుడు.
ముంబయి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఆంధ్ర మహాసభ, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ లాంటి తెలుగు సంస్థలకు హితామహుడైన ఎస్.ఎం.వై.శాస్త్రి ఎన్నో నాటకాలు రచించి తెలుగు సాహిత్యానికి వెలకట్టలేని సేవ చేశారు.'
ప్రముఖ చరిత్రకారుల ఆధారాల ప్రకారం అశోకుని శాసనాల ఆధారంగా శాతవాహనుల కాలంలో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రజల మధ్య సంబంధాలు దృఢతరమైనట్లు రూఢి అవుతున్నది. అప్పటి నుంచి 11, 12వ శతాబ్దం వరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు - ఆ తర్వాత 18వ శతాబ్దం వరకు కొనసాగిన చారిత్రక పరిణామాలు మరొక ఎత్తు. మూడవ దశ 19వ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలై 1950 వరకు కొనసాగిన చరిత్రగా భావించవచ్చు. ఆ తర్వాత సుమారు 60 సంవత్సరాల పిదప ఇప్పుడిప్పుడే తిరిగి ఆ పూర్వకాల వైభవాన్ని కొనసాగించే ప్రయత్నాలు కొనసాగడం సంతోషించదగ్గ అంశం. కాకపోతే ఆ కాలంలో కనిపించే కవుల, రచయితల నిజాయితీ, నిబద్ధత, నిరంతర అధ్యయనం, లోతైన సమగ్ర అవగాహన ఈనాటి సాహితీపరుల్లో కానరాకపోవడం శోచనీయం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|