|
|
Articles: TP Features | భావం పరాయీకరణ - Site Administrator
| |
విశ్వవిద్యాలయాలలో భాష, సాహిత్య శాఖలకు ఇటువంటి ఆసక్తి లేకపోవడానికి వారి దృక్పథాలలో పరిమితులు, క్షేత్ర కృషి మీద తగ్గుతున్న ఆసక్తి ప్రధాన కారణాలు. సాంఘిక శాస్త్రజ్ఞులతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారనుకోవడం అత్యాశ. కానీ మార్గ సంప్రదాయానికి చెందిన వేదం - గణితం - కంప్యూటీకరణ - ఖగోళశాస్త్రం - వైద్యవిధానాలు - నృత్యం - సంగీతం - భాషాశాస్త్రం - సాహిత్యం... వీటన్నింటినీ ప్రాచ్య - పాశ్చాత్య సంప్రదాయాల సమ్మేళనం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతుంది. అవార్డుల పంట పండిస్తున్నది. ఆర్థిక, మానవ శాస్త్రవేత్తలు కలిసి పనిచేయడానికి అవకాశాలను అన్వేషిస్తున్నారు. మేధా సంపత్తి హక్కుల కోసం అంతర్జాతీయ విపణిలో పోటీ పెరుగుతున్నకొద్దీ వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచుకోవలసిందిగా ప్రభుత్వాలు శాస్త్రజ్ఞుల మీద ఒత్తిడి తెస్తున్నాయి. భాష, సాహిత్య, కళారంగాలలో ఆసక్తి చూపే రాజకీయ నాయకులు, కళాపోషకులు, ప్రచురణకర్తలు ఈ అంతర్జాతీయ పరిణామాల పట్ల అవగాహన పెంచుకుని తెలుగుజాతి విజ్ఞానంలో ప్రత్యేకతలను నిరూపించే పరిశోధనలు చేపట్టాలని పండితుల మీద ఒత్తిడి తీసుకురావాలి.
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎలాగూ ఈ పథకాలను చేపడుతున్నాయి. దేశ, కాల ఔచిత్యం మరచి తమ అనుభవాలను ప్రజల మీద రుద్దుతున్నాయి. భాష, సాహిత్య రంగాలు ఈ పనికి పూనుకుంటే ఆయా జాతుల విజ్ఞానంలో శాస్త్రీయతతో పాటు నమ్మకాలు - మూఢనమ్మకాలు, ఆదాన - ప్రదానాలు, అర్థ విపరిణామాలు, అపభ్రంశాలు, ఔచిత్యం, రసజ్ఞత, సృజనాత్మకత, ప్రత్యేకత మొదలైన మానవీయ కోణాలెన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పాతవాటికి మరికొన్ని పదాలు చేర్చడం తప్ప మన నిఘంటువు నిర్మాణంలో కొత్తదనం ఏమీ కనిపించదు. సరిగా చేస్తే అదే పదివేలు. ఉదాహరణకు `కొత్తమాస'ను తీసుకుందాం.
ఉగాదికి ముందు రోజును `కొత్తమాస' గా గోదావరి జిల్లాల్లో పిలుస్తారు. పంటల పండుగలను గిరిజనులు, గ్రామీణులు, `కొత్తలు కలపడం', `కొత్తల పండుగ' అంటారు. సామ, జొన్న, పప్పు ఇలా అన్ని పంటలకూ `కొత్తలు' తీరిన తరువాత వచ్చే అమావాస్య `కొత్తఅమాస'.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|