|
|
Articles: TP Features | ఆరిన జ్వాల నక్సల్ బరీ - Site Administrator
| |
గత విప్లవోద్యమ స్మృతుల జాడలు నక్సల్ బరీ గ్రామంలోనూ, అక్కడి ప్రజలలోనూ కనిపించడం కష్టమే. అక్కడికి దగ్గరలో ఉన్న తుకురియా అడవుల్లో నక్సలైట్లు గెరిల్లా యుద్ధ శిక్షణ ఇస్తుంటారన్న సమాచారన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్ని పిల్లవాడిని ప్రశ్నిస్తే `మేము రోజూ ఆ అడవిలో తిరుగుతూనే ఉంటాం. అక్కడ నక్సలైట్లు ఎవరూ లేరు. పాములు మాత్రం ఉన్నయ'ని సమాధానం ఇచ్చాడు. 1980కు ముందు అక్కడ నివసించామని అంగీకరించడానికి వృద్ధులు సైతం నిరాకరిస్తారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా 'మేం ఎప్పుడో విన్నాం. కొంతమంది విధ్వంసకారులపై పోలీసులు కాల్పులు జరిపారట' అని మాత్రం చెబుతారు. `మీరు నక్సల్ ఉద్యమ జాడలను తెలుసుకోడానికి నక్సల్ బరీ వెళితే ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ స్మృతులను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు. దానిని గురించి మాట్లాడటానికి ఇప్పటీకీ ఆ ప్రజలు భయపడతార'ని అభిజిత్ ముజుందార్ చెప్పారు.
కానూ సన్యాల్ తో కలిసి పనిచేసిన మరో అగ్రనేత జంగల్ సంథాల్ 1987లో మరణించారు. చివరి రోజుల్లో మద్యానికి బానిసైన సంథాల్ చివరకు ఆ వ్యసనానికే బలైపోయారు. విప్లవం పట్ల సంథాల్ కు ఉన్న భ్రమలు తొలగిపోయాయట అన్న ప్రశ్నకు కానూ సమాధానం ఇస్తూ లేదు, అలా జరగలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సంథాల్ కారు కొనుక్కున్నాడు. నేను వద్దని సలహా చెప్పాను. అతను కారులో తిరగడంలో అర్ధంలేదు. అతను నాలుగు సార్లు పెళ్ళిళ్లు చేసుకున్నాడు. భార్యలను ఎలా పోషించేవాడో ఇప్పటికీ నాకు తెలియదు. ఉద్యమం కాదు మద్యమే అతని ప్రాణాలు తీసిందని వివరించారు.
ముజిబుర్ రహ్మన్ కుటుంబం ఇప్పుడు చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉజ్జ్వలమైన ఉద్యమ జ్ఞాపకాలను ఈ వృద్ధుడు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. `నా తలపై అప్పటి ప్రభుత్వం 50 వేల రూపాయల నజరానాను ప్రకటించింది. నన్ను బతికుండగా గాని, శవంగా గాని అప్పగించిన వారికి ఆ బహుమతి ఇస్తామంది. అయినా నేను భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేవాడిని. పోలీసులకు గాని, సిఆర్ పిఎఫ్ జవాన్లకు గాని నన్ను ముట్టుకునే ధైర్యం లేద'ని గర్వంగా చెబుతారు. మరో అగ్గిబరాటా నాయకుడు ఖోకొన్ ముజుందార్ యేడాది కాలంగా పక్షవాతంతో మాట పడిపోయి, బాధపడుతూ తన చివరి రోజులను గడుపుతున్నారు.
ఇప్పుడు సాగుతున్నలాల్ ఘడ్ ఉద్యమానికి నక్సల్ బరీకి పోలికలు కలుస్తాయా అన్న ప్రశ్నకు అభిజిత్ ముజుందార్ సమాధానం ఇస్తూ `నక్సలైట్ ఉద్యమం భూమిలేని నిరుపేదలను ఆధారం చేసుకుని వారి ప్రయోజనాల కోసం సాగింది. దానికి ఒక ప్రాంతం, కులం, జాతి అనే భేదాలు లేవు. కాని ఇప్పటి లాల్ ఘడ్ లో మావోయిస్టులు కేవలం గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నార'ని వివరించారు. కానూ సన్యాల్ కు అయితే మావోయిస్టుల మీద ఎలాంటి ఆశలూ లేవు. రెడ్ కారిడార్ అనే ఆ పదాన్నే నేను ద్వేషిస్తున్నానని ఆయన చెప్పారు. `మావోయిస్టుల ప్రభావం ఏవో కొన్ని అడవులకే పరిమితమైపోయింది. వాళ్ళ మనుగడ గెరిల్లా యుద్ధ తంత్రం మీదే ఆధారపడింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ అడవులను దాటి మావోయిస్టు ప్రభావం ప్రజల్లోకి వెళుతుందని నేను అనుకోవడం లేదని' ఒకప్పటి నక్సలైట్ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్ అన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|