|
|
Articles: TP Features | గ్రహణాన్ని చూడొచ్చు - Site Administrator
| |
శాస్త్రవేత్తల మాటలు నిజాలే అనడానికి ఆధారం ఏమిటి? అన్న సనాతనుల ప్రశ్నకు సమధానం గ్రహణమే చెబుతుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలోకి వచ్చే భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని బట్టి భూమి ఆకారాన్ని నిర్థారించుకోవచ్చు. ఇది శాస్త్రవేత్తలిచ్చిన సమాధానం. ఎప్పటికప్పుడు గ్రహణం విప్పి చెబుతున్న వాస్తవం. కనుక గ్రహణాన్ని చూస్తే మనకు అనేక శాస్త్రపరమైన విషయాలు తెలుస్తాయి. కాబట్టి వారి మాటలు విని కొంతైనా విజ్ఞానాన్ని సంపాదించుకోవడం మంచి పని. దేవుడు అనే సెంటిమెంటును నమ్ముదాం. అదేచేత్తో గుడ్డి విశ్వాసాలను పక్కన పెట్టి వాస్తవానికి పెద్ద పీటవేద్దాం. అనవసర భయాలతో అరుదైన సంఘటనలు దూరం చేసుకోకుండా చూసుకుందాం. అంధవిశ్వాసాలను ఆవలనెట్టి సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించాలని శాస్త్రవేత్తలు చేస్తున్న విజ్ఞాపలను వినిపించుకుందాం.
సూర్యున్ని వీలైనంత దగ్గరగా, కొండలు, గుట్టలు, చెట్లూ చేమలూ అడ్డు రాకుండా హాయిగా చూడడం కోసం సముద్రతీరాలలో ఆయా రాష్ట్రాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తయిన భవనాల మీద నుంచి చూసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా గ్రహణ సమయంలో ఆకాశంలోకి ఎగిరి చూసేందుకు వీలుగా విమాన సర్వీసులను కూడా నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రహణం పేరుతో సూరత్ టూరిజం శాఖ వారు పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని, డబ్బును కూడా భారీగానే సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ అవకాశం అర్థికంగానూ కలిసిరావడం ముదావహం.
(ఆంధ్రప్రభ సౌజన్యంతో)
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|