|
|
Articles: TP Features | తెలుగుజాతి కోసం... - Site Administrator
| |
ప్రజల్లో భాష పట్ల భాషా జాతీయత పట్ల అవగాహనను పెంపొందించడం అవసరమే. అయితే, వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురి అవుతున్న సామాన్య ప్రజల్లో తల్లి భాష మన ప్రాణావసరమని చెప్పితే చాలదు. నిజానికి తల్లి భాషతో వారికున్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. కానీ, తమ అభివృద్ధికి తమ భాషాసంస్కృతులు తోడ్పడాలని వారు కోరుతున్నారు. సమాజంలోని అందరితో అన్ని విధాలుగా సమాన అవకాశాలతో ఎదగాలని కోరడం వారి తప్పు కాదు. అందు కోసం కావలసిన విధంగా భాషను, దాని స్థాయిని బలపడాలన్నా కావల్సింది ఇదే. అందుకే తెలుగుజాతి ముందున్న ప్రాణావసరం ఇది.
ఈ నేల మీద ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలలో ఇటీవలి ఎన్నికల్లో మార్పులు వచ్చాయి. రాజకీయాలలో డబ్బు పాత్రతో పాటు కులాల పాత్ర కూడా పెరిగింది. రాజకీయ పార్టీలు రహస్యంగా కాకుండా బహిరంగంగానే కులాల గురించి మాట్లాడుతున్నాయి. వాళ్ళ ఓట్ల కోసం వారితో మాట్లాడేటప్పుడు వారికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నారు. కానీ, ఆ భాషనూ - వారి భాషాజాతీయతను వారు గౌరవించడం కాదుగదా, గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈ భయంకర సత్యాన్ని, నిర్లక్ష్యాన్ని రాజకీయ పార్టీలకు అర్థమయ్యేట్లు చెయ్యడానికి స్వాభిమాన ప్రాతిపదికగా ఉద్యమాలు రావాల్సిందే. ఏ విధమైన అలక్ష్యాన్నీ తెలుగుజాతి సహించదనే స్పృహతో రాజకీయ పార్టీల కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. ఈ పరిస్థితిని నిర్మాణం చెయ్యవలసిందీ ఉద్యమాల ద్వారానే.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|