|
|
Articles: TP Features | `చిక్కిపోయిన' చిరు - Site Administrator
| |
ఎన్నికల ముందు నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసిన దేవేందర్ గౌడ్ కూడా తిరిగి 'సొంతబాట' చూసుకున్నారు. చిరంజీవితో సన్నిహితం గల కాంగ్రెస్ మంత్రులు వట్టి వసంతకుమార్ వంటివారు చిరంజీవిపైన కూడా 'ఆపరేషన్ ఆకర్ష్' ను ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు పార్టీ శాసనసభ్యులు తమ నియోజకవవర్గాల్లో పనులు కావాలంటే అధికారపక్షం కాంగ్రెస్ ను విమర్శించలేని స్థితికి చేరారు. ఏమాత్రమైనా పనులు చేయకపోతే నియోజకవర్గం ప్రజల దృష్టిలో 'కనుమరుగు' అవుతామన్న భయం వీరిది. ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్ ప్రజారాజ్యం నేతలు 'ఇలాగైతే, మనం మురిగిపోతామని' చిరంజీవిని హెచ్చరించారు. ఐదేళ్ళు నిలబడి ఎన్నికలను ఎదుర్కోవాలంటే పోరాటాలే శరణ్యమని హితబోధ చేశారు.
ఎన్నికల ముందు ఇతర పార్టీలను 'శుష్కింప' చేసిన ప్రజారాజ్యం ఎన్నికల ఫలితాల తరువాత 'చిక్కిపోవడం' ప్రారంభమైంది. అసెంబ్లీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పాటు తామూ ఉన్నామని చెప్పిన చిరంజీవి... రాజకీయ పోరాట క్షేత్రంలో తన ఉనికి కోసం ఏం చేస్తారో చూడాలి!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|