|
|
Articles: TP Features | మార్పంటే ఇదే! - Site Administrator
| |
వారి బృందం మొత్తం ప్రయాణం 'బిగ్ ఆపిల్' అన్నారు. అదొక గొప్ప అనుభవం అని ఎలుగెత్తి చాటారు. ఇక న్యూయార్క్ నగరమా - అది అలాటి ఇలాటి నగరమా... వింత వింతలన్నీ చూశారు. ఇక మీ అనుభవాలు ఎలా ఉన్నాయి అని అడిగితే అక్కడా ఇతరత్రా శ్రమపడే స్త్రీలు ఉన్నారు. వారు పడే శ్రమశక్తి మాకు స్ఫూర్తి ఇచ్చింది. కాని వారు దుస్తులు చూసి కాస్త విస్తుపోయాం అన్నారు. దుస్తులు కురచన - ప్రదర్శించే శరీరభాగం ఎక్కువ. మా మగాళ్ళు ఇలా తిరగనిస్తారా... అమ్మో...
ఇక ఇతర విషయాలకి వెళ్తే రాజస్థాన్ ప్రభుత్వం చట్టాలేవో చేసింది. కాని అవే పనులు ఇంకా అందరితో చేయిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా చట్టాలను అమలుచేయలేకపోతోది. చట్టం అధిగమించినందుకు ఎవరిపైనా చర్యలు తీసికొన్న దాఖలాలు లేవు. కేంద్రప్రభుత్వ అంచనాల ప్రకారం 3.42 లక్షల మంది భారతదేశంలో ఇలాటి నికృష్ఠమైన పనులు చేసుకొంటూ బతుకుతున్నారు. కాని ఈ సంఖ్యకి నాలుగు రెట్ల మంది ఈ వృత్తిలో మగ్గుతున్నారని అనేక సేవాసంస్థల అంచనా. ఒక్క ఆల్వార్ నగరంలోనే 100 కుటుంబాలు ఈ అథమాథమ వృత్తిలో ఉన్నారు. భరత్ పూర్ లో ఏకంగా 600 కుటుంబాలున్నాయి.
రాజస్థాన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకొంది. 'నయీ దిశాయేన్' చొరవకు స్పందించింది. టోంక్ అనే ఊరిలో 225 మంది ఇలాటివారు ఉన్నారు. అందులో 190 మంది స్త్రీలే. ఆల్వార్ మాదిరిగానే ఇక్కడ కూడా అలాటి చర్యలు తీసుకోడానికి ముందుకు రావాలని సులభ్ ఇంటర్నేషనల్ ను కోరింది. తగిన ధనసహాయం చేస్తానంది. ఇది ఒక శుభ సూచన.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|