|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
జగన్ ఒక్కరే కాదు సీనియర్లు పలువురు పోటీలో ఉన్నారు అని అన్నా పిసిసి అధ్యక్షుడిని గేలిచేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆయనను మనస్థాపానికి గురిచేయడానికి జగన్ సమర్ధకులు వెనుకాడలేదు. కొందరు మంత్రులు సైతం జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే తాము మళ్ళీ పదవీ ప్రమాణస్వీకారం చేస్తామని మొండికేశారు. దీంతో అలాంటి వారిని అధిష్టానం గట్టిగా మందలించాల్సి వచ్చిందని సమాచారం.
తెలంగాణ పాలక కులం పెద్దలు కొందరు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరును మొదటగా గట్టిగా ప్రతిపాదించినా చివరికి ఆ జైపాల్ రెడ్డే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పేరును సూచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మరో పాలక కులం వారు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ తనయ కేంద్రమంత్రి పురంధేశ్వరి పేరును తెర మీదకు తెచ్చారు. ఆమె ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు బలహీనమౌతాడని ఆ సామాజిక వర్గం పెద్దలంతా ఆయన వెనుక నుండి కాంగ్రెస్ గొడుగు కిందకు వస్తారని వారు సూత్రీకరణ చేస్తున్నారని వినికిడి.
వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యూహాలు, యత్నాల వల్ల తెలంగాణ ఉద్యమం ఛిద్రమైపోయింది, ఛిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారులో తెలంగాణ అంశం ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే మావోయిస్టుల సమస్య కూడా ప్రభావం చూపని అంశమే అయింది. మావోయిస్టు ఉద్యమం కనిష్ట స్థాయికి పడిపోయింది. పలు గ్రూపుల దళాలు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. సైన్యాన్ని కోల్పోయిన జనరల్స్ వివిధ నక్సలైట్ గ్రూపుల నాయకులు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, అధికార రాజకీయాల్లో పాల్గొంటూ ఇంకొందరు పాలకవర్గాలకు పాచికలుగా వినియుక్తం అవుతున్నారు. ఒకే గ్రూపు వారు అడపా, దడపా ఉనికి చాటుకుంటూ రాష్ట్రంలో మేము ఇంకా ఉన్నామంటున్నారు. కాని వారి ప్రభావం తక్కువగా ఉందనే చెప్పక తప్పదు.
అన్ని ప్రభావాలు లుప్తమవగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం బలంగా ముందుకు వచ్చింది. ఆయన అభ్యర్ధిత్వాన్ని కోరుతున్నవారందరూ రాజశేఖరరెడ్డి కోటరిలోని వారూ, ఆయన ద్వారా ప్రయోజనం పొందిన వారూ, పొందుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. వీరు కాకుండా ఆయన మతస్థులు, కులస్థులు గట్టిగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కోరుతున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|