|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
అయితే ఇప్పుడు దేశభక్తులు ఎవరు? ప్రశ్నించుకోవాలి.
ఈ దేశభక్తి, భారతీయత (Indianness)కి సినీతారలు ప్రతినిధులుగా ఉన్నారు. ఒక భారతీయునికి పాశ్చాత్య దేశం గౌరవ డాక్టరేట్ ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారు? సినిమాలో పదిమంది డూప్ ల సహాయంతో నటించే షారుఖ్ ఖాన్ కో, మరో నటుడికో ఇస్తారు.
భారతీయ నృత్యాన్ని చూడాలన్నా, సంగీతాన్ని వినాలన్నా సినిమావాళ్ళని విదేశాలకి పంపిస్తాం. వాళ్ళనే నిర్వాహకులు రప్పిస్తారు. వీళ్ళే మన సాంస్కృతిక రాయబారులు. డూపులు లేకుండా క్రికెట్ ఆట ఆడేవారు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతారు. అంతే తప్ప భారతీయతకి వీరు సంకేతం కాలేరు. సాంస్కృతిక వారసులు అసలే కాలేరు. కాకపోతే వీళ్ళు కూడా ఎంతో గ్లామర్ కలిగి ఉంటారు. అయినా ఈ తేడా ఎందుకో మరి?
ఇకపోతే ఒకరిద్దరు సంగీంత వాద్యకారులో, శాస్త్రీయ నృత్య కళాకారులో సంకేతాలుగా కనిపించి ఆ తదుపరి తెర వెనక్కి పోతారు. అందుకే సినీకళాకారులే భారతదేశానికీ, భారతీయతకి ప్రతినిధులు. వీరే దేశభక్తులు. భారతదేశం ఆత్మగౌరవం కాపాడే తేజాలు. వీళ్ళే మన ఎన్నికల ప్రచార కర్తలు. పార్టీల నిర్మాతలు. సొంతదారులు. ఒక్కొక్కసారి వీళ్ళే సాంస్కృతిక జాతీయత వంటి పెద్ద పదాలతో ముందుకు వస్తుంటారు.
ఇదే పరిస్థితిని చాలా కాలం కిందట నుండి నేటి దాకా జాతి ఎదుర్కొంటున్నది.
రాజకీయ భౌగోళిక చట్రంలో మనల్ని మనం మరచిపోయాం. రాజులు, దండయాత్రలు, గెలుపోటముల అధీనంలో తెలుగుజాతి అల్లకల్లోలంగా, అస్తవ్యస్థంగా తయారైంది. శాతవాహనులు, కాకతీయులు, గోలకొండ నవాబులు, ఆసఫ్ జాహీల పాలనా కాలంలో ఒకే గొడుగు నీడన తెలుగువాళ్ళు చాలాకాలం జీవించారు. 1840 నుండే ఆంగ్లేయ పాలకుల కింద ఆంధ్ర ప్రాంతం, ఆసఫ్ జాహీల పాలన కింద తెలంగాణ ప్రజలు పాలితులుగా ఉన్నారు. ఈ విభజనే మన మనస్సులో నాటుకుపోయింది. గత కాలపు ఐక్యత గాలిలో కొట్టుకుపోయింది. ఆనాడు ఎక్కడ ఉన్నా అంతా ఒక్కటిగానే సాగిపోయిన మంచి సంస్కృతిని విస్మరించాం.
సాంస్కృతికంగా, సాహిత్యంగా, మతపరంగా ఉద్యమాల పరంగా అంతా ఒక్కటే అన్న భావన ఉండింది. ఇప్పుడది చాలావరకు లోపించింది. అలా లోపించడానికి అసమ ఆర్థిక అభివృద్ధే కారణం. అంతేకాని మత, సాంస్కృతిక, భాషా విషయాలు ఏమాత్రం కాదు. కాని వీటిని మాత్రమే ప్రధానంగా చూపిస్తూ విభజనలు తెచ్చే ధనికవాద పెత్తందారీ మనస్తత్వం, ఆ వర్గ దుర్గుణాల్ని చూసీ చూడనట్లు పక్కన పడేశాం. అందుకే ఇప్పుడు సామాన్య ప్రజలలో సైతం ఐక్యభావనకి గండికొట్టి రాజకీయం తన ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మనం తెలుగుజాతి, భాషీయతని గురించి మాట్లాడుకోవలసి వస్తున్నది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|