|
|
Articles: Devotion | సాయి నక్షత్ర మాలిక - Site Administrator
| |
హేమాదును దీవించితివీ - నీదు చరిత్ర వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ - పరితాపము నెడబాపితివీ
లక్ష్మీబాయిని పిలిచితివీ - తొమ్మిది నాణెములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ - ముక్తికి మార్గము చూపితివీ
బూటీ కలలో కొచ్చితివీ - ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణము నిలిపితివీ - మహా సమాధీ చెందితివీ
సమాధి నుండే పలికితివీ - హారతినిమ్మని అడిగితివీ
మురళీధరునిగ నిలిచితివీ -కరుమామృతమును చిలికితివీ
చెప్పినదేదో చేసితివీ - చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితివీ - దశ దిశలా భాసిల్లితివీ
సకల దేవతలు నీవెనయా - సకల శుభములను కూర్చుమయా
సతతము నిను ధ్యానింతుమయా - సద్గురు మాహృది నిలుపుమయా
సాయి నక్షత్రమాలికా - భవరోగాలకు మూలికా
పారాయణ కిది తేలికా - ఫలమిచ్చుటలో ఏలికా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|