|
|
Articles: TP Features | విశ్వ వేదిక 'మ్యూజిగుల్' - Site Administrator
| |
మ్యూజిగుల్ - ముఖ్యంగా ప్రతిభావంతులైన ఔత్సాహిక కళాకారులకు అండగా నిలబడుతుందని ఆనంద్ అన్నారు. కళాకారులకు సరాసరి అభిమానులతో సంబంధాలను నెలకొల్పడానికి మ్యూజిగుల్ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఒక కొత్త గాయకునికి చాలా మంది అభిమానులు ఉండవచ్చు. కానీ వారి మధ్య పరిచయాలు లేకపోవచ్చు. అలాంటి స్థితి కళాకారుల అభివృద్ధికి సాయం చేయదు. అభిమానుల ఆశీస్సులతోనే కళాకారులు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతారు. అలాంటి అంతరాలను మ్యూజిగుల్ ఇక నుంచి తగ్గించి వేస్తుందని ఆనంద్ వివరించారు.
ప్రపంచంలో జీవన విధానం చాలా వేగవంతమైపోయింది. ప్రవాసాంధ్రుల జీవితం మరీ పరుగుమయం అయిపోయింది. అంతా డ్రైవింగ్ జీవితం. కారులోనే సగం జీవితం ముగిసిపోతుంది. కూర్చుని చదువుకుని తెలుగు సాహిత్యం, సంగీతం ఔన్నత్యాలను గురించి తీరికగా ఆలోచించే వ్యవధి లేదు. అంతమాత్రాన వారు దానికి దూరమైపోవాలనుకోవడం లేదు. అదిగో అలాంటి వారి కోసమే ఆడియో బుక్స్- ఆడియో స్టోరీస్ ను మ్యూజిగుల్ రూపొందించబోతోందని ఆనంద్ వెల్లడించారు. తెలుగులో పేరేన్నికగన్న రచయితల నుంచి కొత్త రచయితల, కవుల రచనలను ఆడియో రూపంలో రికార్డు చేసి వాటిని ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. కారులో ప్రయాణం చేస్తూనే మంచి మంచి కథలు, కవితలు వినే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.
అలానే గాయనీ గాయకులతో మంచి మంచి ఆల్బమ్ లు రూపొందించనున్నామని ఆనంద్ తెలిపారు. తెలుగులో ఉన్న ఇంచుమించు అందరు సంగీత దర్శకులతో వీటి రూపకల్పనకు కృషిచేస్తామని చెప్పారు. కొత్తవారికి అవకాశాలు వెతుక్కుంటూ రావని, వారే అవకాశాల కోసం వెతుక్కోవాలని చెబుతూనే అలాంటి వారికి మ్యూజిగుల్ బాసటగా నిలుస్తుందని ఆనంద్ వివరించారు. తెలుగునేలపై ఉన్న ప్రతిభకు కావాల్సిందల్లా మార్కెటింగ్ సూత్రమేనని ఆనంద్ అభిప్రాయపడ్డారు.
లక్ష గళ స్వరార్చనకు రెండు లక్షల మంది వచ్చారు. ఆ కార్యక్రమం గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతుంది. గిన్నిస్ లోకి ఎక్కితేనే అన్నమయ్యకు గుర్తింపా? అని అడిగేవాళ్ళు ఉన్నారు. నేను వారిని గురించి పట్టించుకోను. అన్నమయ్యనే కాదు... ఇది ప్రపంచం. ఈ ప్రపంచానికి తెలుగువాడి గొప్పతనం తెలియాలి. తెలుగువాడి ప్రతిభ ప్రపంచం నలుచెరగులా వ్యాపించాలి... దాని కోసం నిరంతరం ప్రయత్నం సాగిస్తూనే ఉంటామని మ్యూజిగుల్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్యకార్యనిర్వాహణాధికారి కూచిభొట్ల ఆనంద్ స్పష్టం చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|