|
|
Articles: My Thoughts | 'పింగళి'కి ప్రాణం పోద్దాం!! - Site Administrator
| |
జేబున్నీసా నాటకం ప్రతిపాదించిన అంశంపై అయ్యదేవర కాళేశ్వర్రావుగారు స్వతంత్ర పత్రికలో రాసిన విమర్శ. దానిపై స్పందిస్తూ కృష్ణాపత్రికలో ముట్నూరి కృష్ణారావుగారి సమాధానం చదివాక నేను చేస్తున్న పని సరైనదీ... అర్ధవంతమనదీ అనిపించింది. హిందూ ముస్లిం సమస్య నేపథ్యంగా ఈ నాటకం రూపొందింది. ఇస్లాం సంప్రదాయాలను, సాహిత్యాన్ని, కళలను అన్నింటినీ ప్రేమించడంతో పాటు... అవసరమైతే... వారి తరఫున పోరాడే స్థైర్యాన్ని జనంలో నింపడమే ఇప్పుడు చేయాల్సిన పని అని గట్టిగా చెప్తాడు. ఇస్లాం తరఫున కత్తిదూయగల హైందవవీరుణ్ణి కలగనడం మామూలు విషయం కాదనిపించింది. ఇక నాటకంలో... ఔరంగజేబు కుమార్తె జేబున్నీసా... ఛత్రపతి శివాజీ ఆధ్యాత్మిక జౌన్నత్యాన్ని ప్రేమిస్తుంది. అతని నిబద్దతను ప్రేమిస్తుంది. శివాజీ పారిపోవడానికి సహకరిస్తుంది.
అలాగే వింధ్యరాణి - సత్యం, అహింసలను నేపథ్యంగా తీసుకుని రచించిన నాటకం. ఇక మేవాడ్ రాజ్యపతనం, క్షాత్రహిందు చారిత్రక నాటకాలు. సామ్రాజ్యవాద చరిత్రకారులు ఈ దేశ చరిత్రను వక్రీకరించారని అనేకమంది కవులు, కళాకారులు ఆక్రోశించారు. ఇక్కడి చరిత్ర తెలియాలంటే... రాళ్ళను అడగండి... చెట్లను అడగండి... అని భరత్ వ్యాస్ ఓ సిన్మాపాటలో చెప్తాడు. దాదాపు అదే ఆవేదన నుంచి విశ్వనాధ సత్యనారాయణ రచనలు చేశారు. శాంతారామ్ సిన్మాలు తీశాడు. జాతీయోద్యమ నేపథ్యంలో... బందరు నేషనల్ కాలేజీ అందించిన స్ఫూర్తి నుంచి పింగళి రచయితగా జన్మనెత్తడానే విషయం ఈ నాటకాలు చదివితేనే తెలుస్తుంది.
అందుకే... ఈ నాటకాలను పునర్ముద్రించి ఈ తరానికి అందించాలనుకున్నాను. డిటిపి పూర్తయి... 734 పేజీలు వచ్చిన ఈ గ్రంథం ప్రచురణ నా ఒక్కడి వల్లా అయ్యే పనికాదు. అందుకే... ఈ ప్రయత్నానికి తోడ్పాటు కోరుతూ... తెలుగుపీపుల్ ద్వారా మీ ముందుకు వచ్చాను.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|