|
|
Articles: TP Features | సుప్రీంకోర్టు గొప్ప తీర్పు - Site Administrator
| |
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కన్నడం మాతృభాషగా కలిగినవారికి కూడా వర్తించేటట్లయితే, కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును పున: పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు. ఇదే సందర్భంలో ఆ కోర్టు చేసిన వ్యాఖ్యను తొలగించమని కూడా కోరవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ప్రాథమిక దశ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకపోతే క్లర్కులు కాలేని పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య నమ్మశక్యంగా లేదు. హిందీ భాషా రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశమే లేదు. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మాతృభాషలో విద్యను అభ్యసించిన అభ్యర్థుల పట్ల వివక్ష చూపిస్తున్నాయని అనుకోవడానికి ఆస్కారం లేదు. పైగా ప్రభుత్వ నియామకాలు రాజ్యాంగ నిర్దిష్టమైన రిజర్వేషన్ల ప్రాతిపదికపై జరుగుతాయి గాని బోధనా మాధ్యమంపై ఆధారపడి కాదు కదా! వాస్తవ పరిస్థితిని కోర్టుకు విన్నవించి తీర్పును సవరించమని కోరవచ్చు.
ఈ తీర్పు కన్నడేతర భాషలను మాతృభాషగా కలిగినవారికి మాత్రమే అన్వయిస్తే మనం ఎందుకు అభ్యంతరం పెట్టాలి. బెంగళూరులోని తెలుగు వారిపైనా, చెన్నైలోని తెలుగువారిపై ఆయా రాష్ట్రాల భాషలను ప్రాథమిక స్థాయి నుండి బోధనా మాధ్యమంగా పెడితే మనం హర్షించగలమా? కన్నడిగులకు ఉన్న హక్కు ఇతరులకు ఉండవద్దా? అలా లేకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా?
పేదపిల్లలు, దళిత బహుజనుల పిల్లలు, తెలుగు, ఇతర మాతృభాషలలో విద్య నేర్చుకోవటం వల్ల చాలా వెనుకబడి పోతున్నారు అని ఐలయ్య ఆవేదన చెందుతున్నారు. ఇది నిజం కాదు. దానికి కారణం మాతృభాషలో విద్యాబోధన కాదు. సమర్థులైన ఉపాధ్యాయులు లేకపోవడం ఒక కారణం. ఉన్న ఉపాధ్యాయులకు అంకితభావం లేకపోవటం మరొక కారణం. ఆంగ్ల మాధ్యమంలోని ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో సమానంగా కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు వేతనాలను పొందుతున్నారు. కానీ వారు ఉన్నత ప్రమాణాలను సాధించలేకపోతున్నారు. దీనికి కారణం వారి అసమర్థత, జవాబుదారీతనం లేకపోవటం. ఇట్టిపరిస్థితులలో ఉన్న వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెడితే అది సమస్యను మరింత జటిలం చేస్తుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|