|
|
Articles: TP Features | ఓంకారమయం సైన్స్! - Dr. Subrahmanyam Vangala
| |
ఈ రోజున ఆధునిక వసతులతో పిల్లలు టివి, కంప్యూటర్ ముందర కూర్చుని మితిమీరిన తిండి పదార్ధాలను సేవించి లేని రోగాలను చిన్న వయసులోనే కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకూ పనికిరాని కుటుంబ, ఉద్యోగ సంబంధమైన రాజకీయాలతో మానసికారోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాడు మానవుడు.
హిందూ సంస్కృతి చాలా గొప్పదని మనమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలూ పొగడుతున్నాయి. కాని ఈనాడు హిందూ దేశం, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ వాతావరణ కాలుష్యంతో నిండిపోయింది. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే తిండి అన్నీ కలుషితమైపోయాయి. మన సంస్కృతిని పొగడిన దేశాలే ఇప్పుడు మన దేశాన్ని జాలితో చూస్తున్నాయి. లంచగొండితనమే జీవనాధారంగా ఎంచుకున్న మన ప్రభుత్వోద్యోగులు దేశాన్ని దోచుకు తింటున్నారే తప్ప దేశాన్ని ముందుకు నడిపించలేకపోతున్నారు. సామాన్య పౌరుఢు కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ, ఆ సాకుతో తను చేయగలిగిన సాయాన్ని కూడా మరిచి జీవిస్తున్నాడు.
ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించినంత మాత్రాన సరిపోదు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన విధి. అలా అని మన ఇంటిలోని చెత్తను పక్క ఇంటి ఆవరణలో పడవేయడమూ సబబు కాదు. మన శారీరకారోగ్యాన్ని, మానసికారోగ్యాన్ని కాపాడుకోవటం కూడా మన విధి. మన జీవకణంలో ఉన్న ముప్పయి వేల మతాలూ ఒకదానినొకటి అర్ధంచేసుకుని సహకారంతో దైవ సందేశాన్ని అమలు పరిచినట్లే, హిందూ దేశ ఫౌరులంతా ఏకమై, ఎవరి విధులను వారు నిర్వర్తిస్తే, దైవ సందేశాన్ని అమలు పరిచిన వాళ్ళం అవుతాం. 'ఓం'కార నాదంతో మానసికారోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వైజ్ఞానిక పురోగమనానికి తోడ్పడి, మనలోనూ, ఇతర ప్రజల అణువు అణువులోనూ ఉన్న 'ఓం'కార స్వరూపాన్ని చూడగలిగితే శారీరకారోగ్యం, మానసికారోగ్యాలతో నిశ్చింతగా వంద సంవత్సరాలు బతకవచ్చు.
రాత్రి ఒంటి గంటన్నర అయ్యింది. టివి లో ఈనాడు సరాగాలు పాటల కార్యక్రమం మొదలైంది. ఘంటసాల ఆణి ముత్యం 'అయినా మనిషి మారలేదూ, ఆతని ఆశ తీరలేదూ' అని మధురంగా వినిపిస్తోంది. ఇప్పటికి సెలవు. మళ్ళీ కలుద్దాం.
(సుబ్రహ్మణ్యం వంగల, పి.హెచ్.డి.
రింగోస్, న్యూ జెర్సీ, యు. ఎస్.ఎ.)
| Read 31 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|