TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
నేను నా బిఏ!
- Miss rajeswari rajeswarinedunuri
< < Previous   Page: 4 of 6   Next > >  
సరే ఓ మంచిరోజు చూసి చదువు మొదలుపెట్టాను. రాత్రి పన్నెండు వరకు చదివి మళ్ళీ అలారం పెట్టుకుని నాలుగ్గంటలకే లేచి మార్చికి కాకుండా సెప్టెంబరుకే కట్టేశాను వీలైనంత తొందరగా చదివెయ్యాలని. పైగా మార్చి కంటే ఏ అత్తగారైనా హనీమూన్ కి రావచ్చు. మర్నాడు కూడా పిల్లలకి ఏడింటికే అన్నాలు పెట్టేసి నిద్రపొమ్మని సీరియస్ గా చదవడం మొదలుపెట్టాను. హు..! ఏముంది? అరగంట చదివే సరికి డ్రైవరు సిద్ధం. [సారీ డ్రైవరు, క్లీనరు. ఓనరు, మైనరు, మేనేజరు అన్నీ ఆయనే] మేడం... క్విక్... ఈ రోజు సాటర్ డే కదా! వాటెబౌట్ మై పిక్చర్? అని క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టారు. అదేమిటండీ ఈ రోజు చదవకపోతే ద్వితీయ విఘ్నం ఐపోతుంది. నాన్ సెన్స్... పెళ్ళికే తృతీయ విఘ్నం కాకూడదని మూడు నిద్దర్లు ఉంటాయి. అంచేత ఇంకో రెండు రోజులు నాతో మూడు నిద్దర్లు చేసేస్తే తర్వాత నిర్విఘ్నంగా తమరు చదువు కొనసాగించవచ్చు. అందుకే అన్నారు డియర్ వివాహం విద్యా నాశనం అని. నడునడు. తొందర పెట్టారు. ఇక తప్పేదేముంది. కాదంటే మొదటికే మోసం. కసిగా పుస్తకాల్ని టేబుల్ మీద విసిరాను. ఇక మొత్తానికి మర్నాటి నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా సీరియస్ గానే చదువుతున్నాను. ఎక్కువ టైం కూడా లేదు. అసలే నా తొందరకి తగినట్టుగానే సెప్టెంబరు అనుకున్న పరీక్షలు డిశంబరుకి పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇక ఇడ్లీలు పచ్చడులు లాంటివన్నీ మానేశాను. అవును మరి రుబ్బుతూ కూచుంటే ఎంత టైం వేస్టు? గ్రైండరు ఉన్నా అదెప్పుడూ రిపేరే. అందుకని పుస్తకాలని మాత్రం మెత్తగా రుబ్బుతున్నాను. పాపం ఏమనుకున్నారో గానీ మా మైనర్ కుడా నెలకి రెండు సినిమాలు తగ్గించుకుని క్లబ్బులకీ సినిమాలకి అడగడం మానేసి కాస్త ఆలశ్యంగా కూడా రావడం అలవాటు జేసుకున్నారు. [కేవలం నా మీద భక్తి కాదనుకోండి. అక్కడ రేఖో, శశిరేఖో టైపిస్టో తగిలి ఉంటారు] కానీ ఏం ప్రయోజనం? ఉన్నట్టుండి ఒక రోజు 'డార్లింగ్ ఇవ్వాళ క్రిస్మస్ కదా' పెర్సీస్ లో పార్టీ ఉంది ఎప్పుడూ వచ్చేదానివి. ఇప్పుడు రాకపోతే నన్నంతా అడుగుతారు. పైగా నువ్వు రాకపోతే పార్ట్ నర్ ఉండదు అంటూ... మళ్ళీ డ్రింకు ముఖం!

Read 2 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 4 of 6   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.