|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
'అంటే నేను దొంగను కాను. విద్యుత్ చార్జీలు ఎగ్గొట్టను, మీరు చెప్పినట్లు ఆరు నెలల బిల్లులకు సరిపడా అడ్వాన్స్ డబ్బు మీ దగ్గర డిపాజిట్ చేస్తాను. నాణ్యత గురించి అడగకుండా మీరు అమ్మిన మీటర్ నే కొని బిగించుకుంటాను. మీటర్ ను నా ఇంటి ఆవరణలో బిగిస్తే ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీటర్ ను పోల్ మీదనే బిగించడానికి ఒప్పుకుంటాను. మీరు రోజులో ఎన్నిసార్లు కరెంట్ కట్ చేసినా అదేమని అడగను. విద్యుత్ సరఫరాలో ఎన్ని ప్లక్చువేషన్స్ వచ్చినా గొణుగుకోను'. లో వోల్టేజీతో టీవి, ప్రిజ్ లు కాలిపోయినా ఫిర్యాదు చేయను. ఇలాంటి అనేక హామీలను మాట పూర్వకంగా, రాత పూర్వకంగా ఇస్తేనే కరెంట్ శాఖ వారు దయతలచి గృహస్తుకు కనెక్షన్ ఇస్తారు. అదృష్టం బాగుంటే అదనంగా ఎక్కువ వసూలు చేయకుండానే కనెక్షన్ ఇస్తాను. రెండు మూడు అంచెల్లో తృణమో పణమో చెల్లించుకుంటే పని వేగంగా సవ్యంగా జరుగుతుంది, లేదంటే ఆలస్యంగా, ఒడిదుడుకులతో జరుగుతుంది. త్రాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లకు దాదాపు ఇంతే తతంగం ఉంటుంది.
యుఐడి లక్షా యాభైవేల కోట్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ఇన్ఫోసిస్ కు మళ్ళించడానికే లాబీయింగ్ చేసి నందన్ నిలేకని ప్రాజెక్టు చైర్మన్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కాని ఎవరూ దీనిపై పెద్దగా స్పందించలేదు. మొదట ఈ ప్రాజెక్టును పైలట్ గా కర్ణాటక రాష్ట్రంలో చేపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కర్ణాటక ప్రభుత్వానికి గతంలో సోషల్ సర్వే చేసిన అనుభవం ఉంది. ఆ రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి జనాభా వివరాలు సేకరించారు. ఇది కాకుండా కర్ణాటక నందన్ నిలేకని స్వరాష్ట్రం కూడా. 2009 అక్టోబర్ లో నిలేకని హైదరాబాద్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లోనే మొదట ఈ ప్రాజెక్టును చేపడతామని, సహకరించమని ముఖ్యమంత్రితో మాట్లాడి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఇప్పుడు అమలులో ఉన్నాయి. ఇవి కాకుండా ఆదాయపన్ను శాఖలో పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ప్రభుత్వం, ప్రయివేట్ సంస్థలు ఇచ్చేగుర్తింపు కార్డులు, పాస్ పోర్టు లాంటివి ఇప్పుడు పౌరులకు గుర్తింపు కార్డులుగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఎవరైనా ఏ కార్డునైనా పొందడం చాలా సులభం. వీటిలో నకిలీలు, దొంగ పేరు, బినామీ పేర్లు ఎన్నో ఉన్నాయి.
మన రాష్ట్రంలో తెల్లకార్డుల గందరగోళం అందరూ ఎరిగినదే. కొన్నిచోట్ల జనాభా సంఖ్య కన్నా కార్డుల సంఖ్య ఎక్కువ. కోటీశ్వరులు కూడా సునాయాసంగా తెల్లకార్డులు తీసుకున్నారు. కొన్ని ఊళ్ళలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అంతకు మించి రేషన్ కార్డులున్నాయి. యుఐడి కార్డుల విషయంలో కూడా క్రింది స్థాయి ఉద్యోగులు వీలైన అన్ని అవకతవకలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. భారతదేశంలో 'రూల్ ఆఫ్ లా' ఇంకా కచ్చితంగా అమలులోకి రాలేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|