TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
విద్యార్థుల విజయం
- Site Administrator
< < Previous   Page: 4 of 5   Next > >  
అత్రఫ్ బల్దా అంటే కూడా తెలియని అజ్ఞానులు హైదరాబాద్ చరిత్ర గతిని, అభివృద్ధి తీరు తెలియని మూఢులు దీన్ని వివాదం చేయడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ జనాభా రీత్యా పెరిగిందే కానీ సౌకర్యాల రీత్యా పెరగలేదు. మూసీనది ఒడ్డున ఊడిపోయిన ఒక గ్రనేట్ రాయిని కూడా రిప్లేస్ చేయలేనివారు హైదరాబాద్ ను మేమే అభివృద్ధి చేశాం అనడం అతిశయోక్తి తప్ప ఇంకేం కాదు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి, రాష్ట్ర ఏర్పడే నాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం. అన్ని వసతులున్న నగరం. ఆనాటికే అది దేశంలో ఐదవ పెద్ద నగరం. ఇప్పటికీ దానిది అదే స్థానం. వీరి హయాంలో సాధించిన అభివృద్ధి చెప్పుకోదగినది ఏం కాదు. పైగా సుందర నగరాన్ని విస్తరించి మురికికూపంగా మార్చారు. తెలంగాణలో అన్యాక్రాంతమైన భూముల లెక్కలను తీస్తే తెలంగాణా వారికి వలసవాదులు దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత ఇచ్చినా నష్టం పూడదు. ఎందుకంటే, వారు కోల్పోయినది వారి జీవితం, వారి సంస్కృతి. వలసవాదులతో పాటు స్థానిక దొరలు, కరణాలు, చిన్నచిన్న తాయిలాలకు లొంగి భూములను వారికి అప్పగించారు. ఎంత రాసినా వివరించలేని అన్యాయం అది. ఇప్పుడు మనముందున్నది పంపకాలు సామరస్యంగా ఎలా జరగాలి అన్నది. విడిపోయే ముందు ఇరువైపులా పలు సమస్యలు తలెత్తుతాయి. ఆస్తుల పంపకం, నష్టపరిహారం, ఉద్యోగుల పంపిణీ, పెన్షన్ల చెల్లింపులు, వనరుల పంపిణీ, నీటివనరుల వినియోగం, సహజ వనరుల వినియోగం, కొత్త రాజధాని నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం, ఇక్కడే ఉండిపోవాలనుకున్నవారికి రక్షణ ఇత్యాది ఎన్నో సమస్యలుంటాయి. కొంచెం పెద్ద మనస్సుతో ఉంటే ఇరువర్గాల వారికి నష్టం, కష్టం కలగదు. ఇలాంటి సమయంలో స్వార్థపరులు అనేక భయాందోళనలను, వదంతులను ప్రచారం చేస్తారు. వాటిని నమ్మకపోవడం మంచిది. రియల్ ఎస్టేట్ లో సంపాందించి రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడి పెట్టి రానున్న లాభాలను కోల్పోయినందుకే కొందరు ఎంతో చింతిస్తున్నారు. మరి ఇక్కడ జీవితాలను కోల్పోయి నిలువ నీడ లేకుండా అయినవారి గురించి ఎవరు ఆలోచించాలి. ఇరువైపులా పెద్దలు కూర్చుని తండ్రి మనస్సుతో నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భం ఇది. అరవై యేళ్ళు దాటినవారు అయితే బాగుంటుంది. పిన్నవయస్సు వారికి ఆవేశ కావేశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పనంగా సంపాదించుకున్నవారికే అది పోతుందేమో అన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

Read 1 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 4 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.