|
|
Articles: TP Features | కొత్త శక్తి, నూతన ధైర్యం - Site Administrator
| |
ఆయన క్లుప్తంగా 'మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాము?' అనే అంశంపై ప్రసంగించారు. సామెతల్లోని కప్ప మాదిరిగా వివిధ మతాలకు చెందిన మనుషులు తమ చిన్న బావి మాత్రమే ఈ విశాల ప్రపంచమని నమ్ముతున్నారు. సెప్టెంబర్ 19న ఆయన ఒక సుదీర్ఘ వ్యాసం హిందూ మతం మీద చదివాడు. ఇది ఒక బుద్ధి సూక్ష్మత గల వివరణ. 17 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో ఆయన 12 సార్లు ఉపన్యసించాడు. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన నేడు అత్యావశ్యకమైనది రొట్టె అని చెప్పి ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు మతాన్ని బోధించడం వారిని అవమానపర్చటమేనన్నాడు. ఆనాటి యావత్ మఠాధిపతులపైన ఆయన సాధించిన అద్భుత విజయానికి కారణం ఆయన సూచించిన ప్రశాంతమైన విశ్వజనీనతత్వం.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వివేకానందుడు ఉపన్యాస పర్యటన చేసినప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలు గడించాడు. 12 నెలల కాలంలో ఆయన అమెరికాలోని దాదాపు ప్రతి ప్రధాన నగరాన్నీ దర్శించాడు. ఆయన సందేశ సారాన్ని గ్రహించేందుకు స్త్రీ పురుషులతో కూడిన ఒక సంఘం ఆయనను పరివేష్టించింది. ఒక వారంలో ఆయన చేసిన బహిరంగ ఉపన్యాసాలు తరచుగా పన్నెండు కాని, ఇంకా ఎక్కువ కాని ఉండేవి. స్వామీజీ వెలిబుచ్చిన ప్రతి తలంపు ఒక మోహం కాగా ప్రతి మాట ఒక మత విశ్వాసం అయింది. ఆయన ప్రతి ఉపన్యాసం ఆశువుగా సాగే వాగ్ధోరణి గల ప్రవాహం. సెయింట్ లారెన్స్ నదిలోని పెద్ద దీవి అయిన థౌజండ్ ఐలండ్ పార్క్‌లో జలం, అటవీ ప్రదేశంలో ఆయన అందమైన పరిసరాల్లో భారత్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం విలియం జేమ్స్ వంటి వేదాంతితో సహా అనేక మంది ప్రసిద్ధ అమెరికన్లను ఆకర్షించింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆయన శిష్య బృందం త్వరితగతిని వృద్ధి చెందసాగారు. ఆయన పలుకుబడి భక్తుల పరిధిని దాటి వ్యాప్తి చెందింది. స్వామి వివేకానందుని వల్ల భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానం అమెరికాలోని ఒక ప్రాణం గల శక్తిగా ప్రవేశించింది.
భారతదేశానికి చెందిన ఒక గొప్ప జాతీయ రూపం స్వామి వివేకానందుడు. ఆయన ఉపన్యాసాలు ఆఖరయ్యే వరకూ ప్రజలు మంత్రముగ్ధులై ఊపిరి తిప్పుకోకుండా కూర్చుండిపోయేవారు. ఆయన ఉపన్యాసం పూర్తికాగానే శ్రోతలు నూతన ధైర్యంతో, నూతన ఆశాభావంతో, కొత్త శక్తితో, కొత్త విశ్వాసంతో కదలివెళ్ళేవారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|