|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
శే:- ఆచంట వారి సందులో ఓ అందమైన అమ్మాయుంది.ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోవాలి.
సుం: ఆ సందులో ఒక అందమైన అమ్మాయేంకర్మ? అయిదుగురు అందమైన అమ్మాయిలున్నారు.
శే:- అందానికి దాసోహం ఈ అవతారం! ఒరేయ్! ఆ అమ్మాయిల లిస్టు నాకర్జంటుగా ఇవ్వరా!
సుం:-ఒరే! ఏడూ!?
ఏ:- ఏంటి గురూ?
సుం:- అలా థేభ్యంలా చూస్తావేం? ఆ లిస్టు కావాలంటే పాతిక రూపాయలవుతుందని చెప్పు.
ఏ:- అంతే గురూ! పాతిక రూపాయలిత్తేగాని ఆ లిట్టియ్యగ్గురూ!
శే:- ఏడిచినట్టుంది. అయిదు పేర్లకి పాతిక రూపాయలా? కావాలంటే ఓ రెండు రూపాయలిస్తాను. ఇద్దరూ కలిసి ఒన్ బై టూ కాఫీ తాగండి.
ఏ:- అలా ఎలా కుదురుద్ది? మా సుందరం ఆలిట్టు తయారు సెయ్యటానికి ఎంత సొమ్ము తగలేశాడనుకుంటున్నావేటి?!
సుం:- ఎంత కష్ట పడ్డాను?
ఏ:- ఎంత సదువు పాడు సేసుకున్నాడు?
సుం:- ఎంత టయము వేస్ట్ చేసుకున్నాను?
ఏ:- కాల్లరిగేలా ఆల్ల ఇల్ల సుట్టూ తిరిగి ఎన్ని ఎంక్వయిరీలు సేశాడు?
సుం:- ఎంతమందితో పరిచయం చేసుకున్నాను.
ఏ:- ఎంతమంది కాల్లట్టుకున్నాడు? ఎంతమంది సేత తన్నులు తిన్నాడు ?ఇయ్యన్నీ నీకెట్టా తెలుత్తయ్యి?!
సుం:- ఒరే! ఏడూ నువ్వు నోరు ముయ్యరా!
ఏ:- అదేటి గురూ? నేనేటన్నాను? నువ్వు సెప్పమంటేనేగా నాను సెప్పిందీ?
సుం:- అయితే అలాటివా చెప్పడం?!
శే:- ఒరే సుందరం! నాకేమైనా కన్ సెషన్ ఇవ్వరా. కావాలంటే అమ్మాయికో రూపాయి చొప్పున ఇస్తాను. తీసుకో.(జేబులోంచి అయిదు రూపాయల నోటు తీసి పట్టుకుంటాడు.)
ఏ:- అదిపోలే గురూ! ఏడుత్తున్నాడు.ఆడికా లిట్టిచ్చి తగలెయ్యి.
సుం:- (శేషావతరం చేతిలోని అయిదు రూపాయల నోటుని లాక్కుని, రెడీ రెకనర్ తెరిచి) ఒరే! అవతారం అయితే చెబుతాను రాసుకోరా.
శే:-రాసుకోనక్కర్లేదులేరా! నువ్వు చెప్పే వన్నీ నామెదడులో ప్రింటయిపోతాయి.
సుం:- ఆ వీధిలో మూడో ఇల్లు అందమైన పెళ్లి కాని అమ్మాయి పేరు వనజాక్షి. తండ్రికి ఒక్కత్తే కూతురు. అతి గారాబంగా పెరిగింది. పొద్దుట తొమ్మిదింటికి నిద్ర లేస్తుంది. రాత్రి ఏడయ్యేసరికి మంచమెక్కేస్తుంది.కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఇంక అలవాట్లు- నెస్ కేఫేని బెడ్ కాఫీగా తీసుకుంటుంది. మధ్యాహ్నం టాప్ స్తార్ టీ తాగుతుంది. అయిసు క్రీములన్నా -పీచు మిఠాయిలన్నా మహా ఇష్టం. ఈమె సౌందర్య దిన చర్య రోజూ పొద్దున్నే లక్స్ టాయిలెట్ సబ్బుతో మొదలౌతుంది.
ఏ:- అందుకే ఇంట్లో అందరూ ఆమెను ముద్దుగా 'లకుసూ' అని పిలుస్తారు.
సుం:- ఎక్కువగా వాడేవి - 'పాండ్స్ వారి పెద్ద పౌడరు డబ్బా'!
ఏ:- నెల్లోనే ఆకరు !
సుం:- క్లోజ్ అప్ టూత్ పేస్టుతో దంతక్షయాన్ని అరికట్టుకుంటుంది.
ఏ:- కియో కార్పిన్ ఎయిర్ ఆయిలు రాస్తుంది!
సుం:- చేతిలో టిప్-టాప్ మనీ బ్యాగ్, వొంటిపై టై అండ్ డై చీరలు.
ఏ:- కల్లకు అయిటెక్సు కాటుక.
సుం:- కాళ్లకు బాటా వారి హైహీల్డ్ జోళ్లు.
ఏ:- అవతారం గాడి బుగ్గ మీద బాగా పడ గలవు.(శేషావతారం బుగ్గ తడుముకుంటాడు.)
ఏ:- ఉండు గురూ! నాను సదూతాను. ఏడో నంబరింట్లో ఎంకట లచ్ముంటాది. పొద్దున్నే సైరన్ కూతకి లెగుత్తది. కోతి మార్కు నల్ల పల్ల పొడితో పల్లు తోముద్ది. మాస్టరమ్మ పని సేత్తోంది. వంట సేసుకుని తిని బడికి పోద్ది.
సుం:- (పుస్తకం లాక్కుని) లావెక్కుతోందని వొంటి పూట భోంచేస్తోంది. రాత్రి పాలు తాగుతుంది.సాంబారిడ్లీ అంటే పడి ఛస్తుంది. అయిదు ప్లేట్లు అవలీలగా లాగించేస్తుంది.
ఏ:- (పుస్తకం లాక్కుంటాడు) గోద్రెజ్ వారి హెయిర్ డై తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు వాడుద్ది. సెప్పుకో దగ్గ అలవాట్లేం లేవు. దావణగేరే
మల్లులన్నా, వెంకటగిరి-ఉప్పాడ చీరెలన్నా ఇట్టం.
సుం:- (పుస్తకం లాక్కుని) ఆరో ఇంట్లో అందమైన అమ్మాయి అరుణ. దిన చర్య ఒక పంథాలో వుందదు. లక్మె వారి లాక్టో కాలమైన్ నించి అన్ని రకాల స్నోలూ-పౌడర్లూ ముఖానికి పులుముకుంటుంది. రక-రకాల సబ్బుల్ని మార్చి-మార్చి వాడుతుంది. వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. చూసిన సినిమాలనే మళ్లీ మళ్లీ చూస్తుంది. ఈ అమ్మాయికి ఆహారంలో ఇష్టమైనవి- రోడ్డువార మిరపకాయ బజ్జీలు, వేరు శనగకాయలు, ముంతకింద పప్పు, -ఒకటనేమిటి? అన్నిను. ఏం కనిపించినా తినేస్తుంది. కాకరకాయ కూర, కాకర కాయ పచ్చడి, కాకరకాయ పప్పు,కాకరఆయ పులుసు-ఇలా రక రకాలుగా రోజూ కాకరకాయే తింటుంది. ఈమె అభిమాన నటులు తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్-రుషి కపూర్ లు. ఇక బట్టల విషయానికొస్తే .. ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్లీ కట్టదు. ఈమెకు హిప్పీ డ్రెస్సు మగాళ్లంటే మహా ఇష్టం! వాళ్లను కోతుల్లా ఆడిస్తుంది. గ-మ-ని-క-! ఈ అమ్మాయి ఇంట్లో చాలా మంది పురుష పుంగవులున్నారు. ఈ అమ్మాయిని కనక ఏమైనా గొడవ చేస్తే, దేహ సుద్ధి చేసి గాని వదలరు.
శే:- ఒరేయ్! నన్ను భయ పెట్టి చంపకండిరా! ఆ పుస్తకం ఇలాగియ్యి. నేనే చదువు కుంటాను.(పుస్తకం తీసుకుని) పదో ఇంట్లో అమ్మాయి నాగరత్తమ్మ. పేరు బాగాలేదని మాడిఫై చేసుకుంది- 'నాగమణి ' అని. ఇంట్లో అందరూ 'బేబీ ' అనిపిలుస్తారు. (ఆ పేజీలో వేలుంచి, పుస్తకం మూసి,తన్మయత్వంతో) హల్లో బేబీ !డియర్ నాగమణీ!!అయ్ లవ్ యూ! నిన్ను ప్రబంధ పరమేశ్వరిని చేసి పూజిస్తాను.
సుం:- ఒరేయ్ ఫూల్! మిగతాది కూడా చదువు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|