|
|
Articles: Short Stories | కొరికింది - Mr. krishna madugundu
| |
పిల్లోడు ఎంత పిలుస్తున్నా వెంటబడింది. వెనక్కి చూడకుండా అడుగులు ముందుకేశాడు. కాలనీ కాలువ దాటాక గట్టుపై కాస్సేపు కూర్చొని సేద తీర్చుకొన్నాడు. కాసేపయినాక, లేటయితే మరలా భార్య అరుస్తుందని ఊహించి బయలు దేరుటకు సిద్ధమయ్యాడు. నడవాలని కాలు కిందుంచాడు. నొప్పి అనిపించి అబ్బా అన్నాడు. పాదాల కేసి చూసుకొన్నాడు. కండ పీక్కుపోయింది. కుంటుకుంటూ మెల్లగా ముందుకు సాగాడు. నొప్పి భరించలేక భారంగా అడుగులు వేస్తున్నాడు. అటూ ఇటూ ఆటోకోసం గాలిస్తూ, నరీక్షించి నీరుకారాడు. కాస్త ముందుకు వెళ్ళాక అక్కడ ఆటో దొరుకుతుంది అనుకున్నాడు కానీ నడవలేకపోతున్నాడు. ఇంతలో ఓ ఆటో వస్తూ కనిపించడంతో మనసు కాస్త కుదుటపడింది. బేరమాడకుండా ఎక్కి కూర్చున్నాడు. ఎంతైతే అంతైంది అనుకొని...వూ త్వరగా పోనీ అని చెప్పాడు. ఆటో వేగంగా కదిలిపోయింది. ఇంటికి కొద్ది దూరంలో వున్న కిళ్లీ బడ్డి దగ్గర ఆటో ఆపి వక్కపొడి తీసుకున్నాడు. వంద చిల్లర తీసుకొని ఆటో ఎక్కాడు. ఇంటి గేటు దగ్గర ఆపమన్నాడు. భార్యకు కనపడకూడదని గోడకు అడ్డుగా దిగాడు. భార్య చూసిందంటే మంగళహారతి పడ్తుంది. అందుకే ఆ ప్లాన్. మామూలుగా అయితే పది ఇస్తారు. కానీ ఆటో వాణ్ణి సంతోషపరచడానికి పదిహేను రూపాయలు ఇచ్చి పంపాడు. వాడు ఆనందంతో వెళ్ళిపోయాడు. ఇలాంటి గిరాకీలు రోజు పది దొరికితే చాలనుకుంటూ.
అతి మెల్లగా అడుగులు వేస్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళి బెల్ మోగించాడు.
ఎవరూ గట్టిగా కసురుకొంది. నేనేలేవే తియ్యి బిక్కు బిక్కుమంటూ సమాధానం చెప్పాడు.
తలుపు తియ్యగానే సీడీ తెచ్చావా? అని అడిగింది. లేదు అనే సమాధానం వినగానే నీకేదీ చేతకాదు. ఒక్క పనీ చెయ్యలేవు అని మండి పడ్డది. నేను చెప్పేది కాస్త విను. నేను వెళ్ళాను. ఆమె ఇంట్లో లేదు. ఆమె కొడుకున్నాడు. మా అమ్మ ఇమ్మని చెప్పి పాత దేవదాస్ సీడీ ఇచ్చాడే. కొత్తది కావాలి బాబూ అన్నాను. నాకు తెలియదు అన్నాడు. నేమేమీ చేసేది లేక ఉత్త చేతులతో వచ్చేశాను. అని వివరించాడు. పనికిరాని వెధ కింద జమకట్టి కిందకేసి చూసింది. నా కాలు కండ కొరికింది. నువ్వు, నేను ఆటోలో కూర్చున్నంత సేపు అక్కడ బాగున్నానా, అక్కడికి వెళ్ళాక వసంత కాలనీలో కుక్కల బెడద. నాకు కుక్కలంటే భయమని నీకు తెలియదా? ఎందుకు నన్ను చంపుకుతింటున్నావు అంటూ గావు కేకలు పెట్టాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|