|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
నారాయణ: (ప్రవేశం)అమ్మా! అక్కడంతా వెదికాను. ఏమీ దొరకలేదు.
సీతమ్మ: నువ్వు నిజమే చెప్తున్నావా?
నారాయణ: అదేమిటమ్మా! నన్నే అనుమానిస్తున్నావా?
సీతమ్మ: ఇది డబ్బు నాయనా! డబ్బు! ఎవరినైనా అనుమానించ వలసిందే.
నారాయణ: నీకంత అనుమానంగా ఉంటే... నువ్వే వెళ్ళి చూడు.
సీతమ్మ: ఆ మాట నువ్వు చెప్పాలా? నేనే చూస్తాలే (వెళ్ళింది)
నారాయణ: అమ్మో! అమ్మో! బంగారునాణాలు చూడగానే బంగారం లాంటి అమ్మ ఎలా మారిపోయింది! 'అన్నం తిను నాయనా' అని పిలిచి అరక్షణం కాలేదు... 'ఆకలేస్తోందమ్మా' అని నేనడిగితే కూడా 'నీ ఆకలి చట్టుబండలు కానూ' అంటోంది. కాసులు ఇంటికి చేరకుండానే ఇలా మారిపోయిందంటే... చేరాకా ఇక ఎంత కాల్చుకు తినేస్తుందో! రేపు నా భార్య వచ్చాక కాస్త ఆనందంగా గడపాలంటే ఎన్ని ఆంక్షలు పెడుతుందో! ముసలి వాళ్ళకేం తెలుస్తుంది, చిన్నవాళ్ళ సరదా? ఇటు అమ్మకూ చెప్పలేక, అటు ఆలికీ చెప్పలేక నేను నరకయాతన అనుభవించాలి... ఇంతకాలం మోసిన దరిద్రం తీరిపోతోంది! ఇకనైనా మహారాజులా బతుకుతాను... ఈ డబ్బు నాకే దక్కాలి. కానీ అమ్మ బతికి ఉంటే అది సాధ్యం కాదు. ఆందుకే పాపమైనా సరే అమ్మను చంపెయ్యాలి!... ఎలా చంపటం?... (ఆలోచించి) ఆ... ఈ నాగలితో అమ్మ తలమీద ఒక్క దెబ్బ వేస్తాను!... కాటికి కాళ్ళు చాచుకొన్నది... కడతేరితే మునిగిపోయేదేమీ లేదు..
సీతమ్మ: (ప్రవేశించి) నారాయణా! నువ్వు చెప్పింది నిజమే నాయనా! అక్కడ మరో బిందె లేదు. ఎవడు దాచి చచ్చాడో గానీ... ఈ ఒక్క బిందే దాచి చచ్చాడు! రెండోదికూడా దాచి చావకూడదూ! పోనీలే నాయనా! ఇదైనా దక్కింది. అదే చాలు. ఈ మాట పొరపాటునకూడా ఎవరికీ చెప్పకుసుమా!
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|