|
|
Articles: Devotion | శిరిడి దర్శిని - 3 - Mrs. seetha suri
| |
(3) బాయాజి అప్పా కోతె పాటిల్ (సాయి కుటీర్) ఇతడు బీర్గవు పోల్కిసే. 11 ఏండ్ల ప్రాయం నుంచే బాబా సేవకు నోచుకున్న ఘనుడు. బాబా ఇతని తండ్రి చనిపోయే భవిష్యత్ చెప్పాడు. బాబా చెప్పినట్లే జరిగింది. బాబా మహా సమాధి పొందిన వెంటనే ఇతనికి కనపడి నేను వెళ్ళిపోయాను. నన్ను తీసుకుని వాడాకి వెళ్లు. ఇక బ్రాహ్మణులు అందరూ నాతోనే ఉంటారు అన్నాడు. ఇతడు ప్రతిరోజూ బాబా పేరిట మిఠాయిలు పంచేవాడు. అది చూచి బాబా ప్రేమతో ఇతనికి రోజు నాలుగు రూపాయిలు ఇచ్చేవారు. ప్రతిరోజూ బాబా ఇక్కడకు వచ్చి అక్కా రోటి దే అనేవారు.
(4) బాయజా బాయి కోతె పాటిల్ : (బాయజా మాత) ఈ ఇల్లు సాయి కుటీర్ పక్కనే ఉన్నది. బాబా బాల్యావస్థలో శిరిడీని చేరదా ఈమే ఈ బాలుడు సామాన్యుడు కాదు పెద్ద యోగి అని గ్రహించి చెప్పి దరికి చేర్చుకొని అన్నమిచ్చినది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని నమ్మి ఎన్నో నిత్యాన్న సంతర్పణలు చేసింది. బాబా ఎక్కడ ఉన్నా వెతికి రోజూ అన్నం పెట్టే అన్నపూర్ణా దేవి. అదే విధంగా బాబా మొట్టమొదటి భిక్ష ఈమె ఇంటి నుంచే స్వీకరించేవారు. నీకు సంపద కావాలా, సంతతి కావాలా అని బాబా ఆమె కోరికలు అడుగగా ఆమె నా కొడుకు తాత్యాకు ముగ్గురు భార్యలు కలరు. అయినా పిల్లలు లేరు. వారికి పిల్లలను ప్రసాదించు. నా కొడుకు భారం కూడా నీదే అనగా ఆమె మాటలు శిరసా వహించి బాబా తాత్యాకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను ప్రసాదించాడు. తాత్యా మరణ సమయంలో బాబా ప్రాణత్యాగం చేసి తాత్యాను రక్షించాడు.
నందు మార్వాడీ : బాబా భిక్షం ఎత్తుతూ ఆఖరికి వచ్చే ఇల్లు ఇతనిదే. బాబా ఇతని ఇంటి ముందు నిలబడి ఓ భూపతిబాయి భిక్ష దే అనేవారు. ఒకవేళ అతని పత్ని భిక్షం ఇవ్వడానికి ఆలస్యం చేస్తే తిట్టేవారు. భిక్ష తీసుకోకుండా కడుపుని ండా అన్నం వండి ద్వారకామాయికి తెమ్మనేవారు. ఆ పుణ్య స్త్రీ అలాగే చేసేది. అప్పుడు బాబా నవ్వుతూ అందులో నుంచి కొంచెం తీసుకొని తిని మిగాతాది అందరికీ పంచేవారు. 1911లో ప్లేగు వచ్చినపుడు నందరాముకు బాబా ఏ ఊదిని ఇచ్చి నయం చేశాడు. పిల్లలు లేని ఇతనికి మూడు మామిడిపళ్ళు ఇచ్చి పుత్రులను ప్రసాదించాడు. ద్వారకమాయికి బుట్టీవాడకి మధ్య ఉన్న స్థలం ఇతనిదే. దానిని దాము అన్న సహాయంతో బాబాకు సమర్పించగా సమాధి మందిరం విస్తరింపబడినది. ఇతడు 13.10.1940లోమరణించాడు.
ఇవికాక ఇంకా అనేక మంది భక్తుల జ్ఞాపక చిహ్నాలు శిరిడీలో ప్రశస్థాలై విరాజిల్లుతున్నాయి. ఇంతేకాక బాబా దర్శించినవి మరమ్మతులు చేయించినవి ఎన్నో దేవాలయాలు శిరిడిలో ఉన్నాయి. అందులో కొన్ని (1) మహాలక్ష్మి మందిరం (2) కానీఫ్‌నాధ్ ఆలయం (3) విఠల మందిరం (4) గణపతి, శని, మహాదేవ మందిరాలు. బాబా తనకు వచ్చే దక్షిణలలో కొంత భాగం వెచ్చించి ఈ మందిరాలను ప్రతి సంవత్సరం మరమ్మతులు తాత్యా ద్వారా చేయించేవారు. శిరిడి ఒక మహా దివ్య క్షేత్రం. సద్గురు సాయి దత్తావతార స్వయంభూ త్రిమూర్తి వల్లభుడు. ఇది గుప్త ద్వారకగా ప్రసిద్ధి పొందింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|