|
|
Articles: Drama | సంక్రాంతి 'చుట్టరికాలు' - Editor
| |
పిల్ల : ఓరోరి గుంటల్లారా - బయ్యమేల గియ్యమేల
బూచోడు గాదు తాతయ్య - బోలెడు దూరం నుండొచ్చె
బట్టలుకొని తెచ్చినాడు - భలేగున్నయి తొడగర్రా
బొంబాయి నుండొచ్చిండు - బుంగలు తెచ్చిండు
పిల్ల కొడుకులూ, కూతుళ్ళూ :
ఇతగాడెవురమ్మా - యెప్పుడూ సూడలేదు
పిల్ల : పెదతండ్రవుతాడర్ర - పట్నమెళ్లి పోనాడెపుడో
ఇల్లూపొల్లమ్మీసి - సిటీకెలిపోనాడెపుడో
అందరూ : పిల్లాజెల్లా లేరేటి - ఒక్కడొచ్చినాడేటి?
పిల్లడు : దేశమెల్లిపోయారర్ర - దిక్కుమాలి పోయానర్ర
అందరు : దండాలండి తాతయ్యా - దండాలండి పెద్దయ్యా
పిల్లడు : చిరంజీవ! చిరంజీవ! చిరకాలం వర్ధిల్లండిర
ఊరందరూ ఒకరొకరుగా పిల్లడు చుట్టూచేరి సోద్యం చూస్తున్నారు. ఊరి పిల్లలందరికీ బుంగలు పంచిపెట్టాడు పిల్లడు. ఒక క్షణంలో వందలాది రంగురంగుల బుంగలు గాలిలో తేలాడాయి.
రెండు గాలిపటాలు - ఒకటి ఎక్కడో తెగి ఎగిరి ఇక్కడకొచ్చి కొబ్బరి మోపును చుట్టుకుంది. మరొకటి ఎగిరి ఎగిరివచ్చి కిందికి దిగి పక్కనున్న పనస చెట్టు మానుకి చుట్టుకుంది.
మబ్బులు నేలన నడచినట్టు మేకలు, గొర్రెలూ నాలుగువైపుల నుండి ఆలమందలూ మందలు, మందలుగా ఊరుచేరుతున్నాయి.
సూరేమండలం వేపు అల్లంత దూరం నుండి మువ్వల మోత వినబడుతోంది. ఊరందరూ మువ్వల శబ్దం వినబడుతున్న దిక్కుకు తిరిగి చూస్తుండగా, దరిదాపులకు ఎడ్లబళ్లు ఒకటి, రెండు, మూడు... పది... బియ్యం బస్తాలతో పరుగు పరుగున ఊళ్లోకి వస్తున్నాయి. ఎర్రఎర్రని ఊలు పువ్వుల కొరడాలు గాలిలో ఆడుతున్నాయి.
ఉబ్బి తబ్బిబ్బయిన పిల్లడు జనం మద్దిన ఉద్వేగతంతో ఊగిఊగి జనం మద్దిన కూలబడి పల్లకైపోనాడు.
పిల్ల కళ్లల్లో నీరుకమ్మీసి ఆమెకీ ప్రపంచకం కనబడ్డం మానేసింది. గాలి దుమారం రేగి భోగీమంటల బుగ్గిలో సుడిగాలి పుట్టింది.
భోగీ మంటల బొగ్గుల్లోని నిప్పురవ్వలను తాకి తప్పొప్పులు భగ్గున మండి ఆరిపోయాయి.
భూమి తనచుట్టూ తాను తిరగి సంక్రాంతిలోనికి దూరింది. చుట్టరికాలు కనుమలోకి, ముక్కనుమలోకి, అలాఅలా కాలగమనంలోకి....
పుటకకైనా చావుకైనా ప్రేమే చుట్టం.
క్రాంతికీ సంక్రాంతికైనా-
తేడాలలోని అందానికైనా సంఘర్షణలలోని ఫలితానికైనా బంధువు ప్రేమే.
జడత్వంగా గోచరిస్తున్న గమనమూ ప్రేమే. ప్రేమా, మృత్యువూ - రెండూ మంచి స్నేహితులేమే!
(అంతా అయిపోయింది మరి).
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|