|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
దాదాపుగా అందరూ బౌద్ధంలోకో క్రైస్తవానికో మారిపోయి ఉన్నారు. అయినా పిళ్లారిసామిని అంటే వినాయకుడిని మటుకు విడువలేదు. మతం మారడానికి వాళ్లు చెప్పిన కారణం వింటే మనకు నోట మాటరాదు. పిళ్లారిసామిని మొక్కే వాళ్లకి 'ఒలుకులు' లేదట. బుద్ధాగమ వాళ్లకి క్రీస్తువులకి మటుకే ఒలుకులు ఉందంట. ఒలుకులు కోసమే మతం మారాల్సి వచ్చిందట. 'ఒలుకులు' అనే మాట తొండ మండలపు తెలుగు. ఆ మాటకు వల్లకాడు అని అర్థం. బతుకు కోసం మతం మారడం సరే చావు కోసం మారడం వింతగా లేదా!
మతం మారడం వలన వీళ్లు ఎదిగినారు. సొంత ఇల్లూ నేలలూ వచ్చినాయి. నాగరికత పెరిగింది. బిడ్డలను బడికి పంపుతున్నారు. బాగానే ఉంది కానీ మెల్లమెల్లగా తమ మూలాలను మరచిపోతున్నారు. వాళ్లకే సొంతమైన పండుగలూ పబ్బాలూ ఆచారాలూ ఆటలూ పాటలూ దాదాపుగా కనుమరుగయినట్లే. వాళ్ల పాతతీరున పెండ్లి చేసుకొనేటప్పుడు ఆడవాళ్లు అందగా అలంకరించుకొని చిత్రమైన చీరకట్టుతో ఒక నృత్యం చేసేవారు. పాతకాలపు ఫోటో ఒకటి చూపించి అందులో కనిపిస్తున్న ఆ నృత్యాన్ని గురించి వివరించినారు. ఇప్పుడు పెండ్లిండ్లు బుద్ధాగమమో క్రైస్తవం తీరులోనే జరుగుతున్నాయి. ఆ తెలుగాట ఆగిపోయింది.
ఎర్రన్న నాగసారం ఊది పామునాడించి చూపినాడు. ఈ నాగసారాన్ని చెయ్యడానికి కావలసిన చెట్టు కేవలం వీళ్ళ పల్లెల్లోనే ఉంటుంది. ఆ చెట్టు విత్తులను ఏకాలంలోనో లంకకు పోయేటప్పుడు వాళ్ల తాలితావరం నుంచి తీసుకొనిపోయినారట. శ్రీలంకకు ఎప్పుడు వచ్చినారు అని అడిగితే 70 ఏండ్ల ఎర్రన్న చెప్పిన బదులిది, 'మాయబ్బడు, వాళ్ల అబ్బడు, అబ్బనికబ్బడు అందురూ సిర్లంక వాళ్లే. ఎప్పుడొచ్చింది చెప్పేకి అయ్యేలే'. ఆ నాగసారపు చెట్లను హేమాద్రి గారి లాంటి చెట్ల శాస్త్రవేత్తలు పరిశీలిస్తే వాళ్ల తొలి తావును కనిపెట్టవచ్చునేమో!
వాళ్లున్న చోట తమిళ చానళ్లు వస్తున్నాయి. ఇంటిల్లిపాదీ కూచుని తమిళ సినిమాలను బాగా చూస్తుంటారు. తమిళ నటీనటులు బాగా పరిచయం. తెలుగు నటీనటుల గురించి వాళ్లెరుగరు. అడగగా అడగగా ఒకతను మటుకు 'సురంజీవి తెలుసు' అన్నాడు. ఎన్టీఆర్ తెలుసా అంటే 'ఆ తాత సచ్చిపోయెగదా' అన్నాడింకొకతను.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|